చిట్టితల్లి వేడుక చూడకుండానే..
అల్లారుముద్దుగా పెంచుకున్న చిట్టితల్లి పుష్పాలంకరణ వేడుక చూడకుండానే ఆ తండ్రి దూర తీరాలకు చేరుకున్నారు. సామగ్రి తీసుకొస్తుండగా, కారు చక్రాలు కర్కశంగా ఆయన్ను చిదిమేశాయి.
కారు ఢీకొని తండ్రి దుర్మరణం, చిన్నాన్నకు తీవ్ర గాయాలు
బోయిన కాశయ్య (పాత చిత్రం)
మార్కాపురం గ్రామీణం, న్యూస్‌టుడే: అల్లారుముద్దుగా పెంచుకున్న చిట్టితల్లి పుష్పాలంకరణ వేడుక చూడకుండానే ఆ తండ్రి దూర తీరాలకు చేరుకున్నారు. సామగ్రి తీసుకొస్తుండగా, కారు చక్రాలు కర్కశంగా ఆయన్ను చిదిమేశాయి. చేయి పట్టి నడిపించిన నాన్నను విగత జీవిగా చూసిన ఆ చిన్నారి గుండెలవిసేలా రోదించడం అక్కడివారిని కలచివేసింది. ఈ విషాద సంఘటన రాయవరం సమీపంలో మంగళవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. మార్కాపురం గ్రామీణ పోలీసులు తెలిపిన వివరాల మేరకు..కొనకనమిట్ల మండలం గుర్రాలమడుగుకు చెందిన బోయిన కాశయ్య (40), బోయిన కృష్ణ అన్నదమ్ములు. కాశయ్య కుమార్తె వీరమ్మ పుష్పాలంకరణ వేడుక బుధవారం నిర్వహించ తలపెట్టారు. అందుకు సంబంధించిన సామగ్రి తీసుకొచ్చేందుకు అన్నదమ్ములు కాశయ్య, కృష్ణ మంగళవారం మార్కాపురం పట్టణానికి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. పనులు ముగించుకుని వస్తుండగా, రాయవరం సమీపంలో హైదరాబాద్ నుంచి నెల్లూరుకు వెళ్తున్న కారు వెనుక నుంచి బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో కాశయ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, తమ్ముడు కృష్ణకు తీవ్ర గాయాలయ్యాయి. మృతుని భార్య, కుటుంబ సభ్యులు సంఘటన ప్రాంతానికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. తమకు న్యాయం చేయాలని వారు 565 జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. మార్కాపురం గ్రామీణ ఎస్సై వెంకటేశ్వరనాయక్ అక్కడికి చేరుకుని వారికి సర్దిచెప్పారు. కారు చోదకుడిని అదుపులోకి తీసుకున్నారు. బాధితులను ఎమ్మెల్యే అన్నా రాంబాబు పరామర్శించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాకెవరిస్తారు డబ్బులు!
[ 27-07-2024]
ఎన్నికలంటే ప్రజాస్వామ్యానికి పెద్ద పండగ. ఓటు హక్కు కలిగిన వయోజనులందరూ పాల్గొనే క్రతువు. ఇందుకు ఖర్చూ భారీగానే ఉంటుంది. -
దళితుల భూమిలో వైకాపా గద్ద
[ 27-07-2024]
అధికారమే పెట్టుబడిగా వైకాపా నేతలు చెలరేగిపోయారు. గత అయిదేళ్లపాటు తమ అరాచకాన్ని కొనసాగించారు. ప్రభుత్వ, ప్రైవేట్ భూములను ఆక్రమించుకున్నారు. -
శాకంబరి.. శరణు శరణు
[ 27-07-2024]
ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు శాకంబరిగా భక్తులకు శుక్రవారం దర్శనమిచ్చారు. -
104 మంది ఉపాధ్యాయుల అక్రమ బదిలీలు రద్దు
[ 27-07-2024]
గతంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఉపాధ్యాయ అక్రమ బదిలీల ఉత్తర్వులను తాజాగా రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. -
కార్గిల్ వీరులారా వందనం
[ 27-07-2024]
దేశ రక్షణ కోసం కార్గిల్ యుద్ధంలో ప్రాణాలు వదిలిన అమర వీరులకు జిల్లావ్యాప్తంగా శుక్రవారం నివాళి అర్పించారు. -
పేర్లు మారుస్తారే.. పనులు చేయలేరా!
[ 27-07-2024]
‘ఒకరి పేరుపై ఉన్న భూములను నిబంధనలకు విరుద్ధంగా మరొకరి పేరుపై మార్చడం వంటి పనులైతే చేస్తారు. -
రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్‌సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
వైకాపా నేత అక్రమ కట్టడాల కూల్చివేతకు ఆదేశాలు
[ 27-07-2024]
గత అయిదేళ్ల పాలనలో ఓ వైకాపా నేత బరి తెగించి చేపట్టిన అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్‌రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం