logo

తెదేపాలో చేరికల జోరు

తెదేపాలో చేరికలు జోరందుకున్నాయి. మంగళవారం వైకాపా సర్పంచి కోమలి భర్త బొల్లినేని మధు అనుచర గణంతో సహా పార్టీలో చేరారు.

Published : 24 Apr 2024 03:56 IST

సంతనూతలపాడు: వైకాపా నేత మధు, అనుచరులతో తెదేపా ఇన్‌ఛార్జి బీఎన్‌ విజయ్‌కుమార్‌

సంతనూతలపాడు, న్యూస్‌టుడే: తెదేపాలో చేరికలు జోరందుకున్నాయి. మంగళవారం వైకాపా సర్పంచి కోమలి భర్త బొల్లినేని మధు అనుచర గణంతో సహా పార్టీలో చేరారు. మంగళవారం ఒంగోలులోని నియోజకవర్గ తెదేపా కార్యాలయంలో చిలకపాడు గ్రామ నాయకులు కొంకా చిన్నారావు ఆధ్వర్యంలో వచ్చిన 70 కుటుంబాలకు తెదేపా అభ్యర్థి బీఎన్‌ విజయ్‌కుమార్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నియోజకవర్గ పరిశీకులు చౌట శ్రీనివాసరావు, తెదేపా మండలాధ్యక్షుడు మద్దినేని హరిబాబు, నాయకులు నరసింహారావు, పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

చీమకుర్తి: చీమకుర్తికి చెందిన వంద కుటుంబాలు మాజీ ఎమ్మెల్యే బీఎన్‌. విజయ్‌ కుమార్‌ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరాయి. వార్డు మాజీ సభ్యురాలు బాపతు వీరమణి శ్రీనివాసరెడ్డి దంపతులు, ముస్లిం యూత్‌ నాయకులు షేక్‌ రఫీ, బూసరపల్లి సలీమ్‌ తదితరులు వైకాపాను వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరందరికి విజయ్‌కుమార్‌ పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ నాయకులు మన్నం ప్రసాదరావు, కందిమళ్ల గంగాధరరావు, కాట్రగడ్డ రమణయ్య, రావిపాటి రాంబాబు, సూరంపల్లి హనుమంతరావు, యడ్లపల్లి రామబ్రహ్మం, గొల్లపూడి కోటేశ్వరరావు, రావిపాటి శ్రీనివాసరావు పాల్గొన్నారు.

ఒంగోలు నగరం: మంగళవారం స్థానిక బాలాజీరావు కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైకాపా నాయకులు రావూరి బుజ్జి, ఏడో డివిజన్‌ నాయకుడు షేక్‌ బాచి, షేక్‌ సోఫియా వారి అనుచరులతో కలసి తెదేపాలో చేరారు. పార్టీ అభ్యర్థి దామచర్ల జనార్దన్‌ సమక్షంలో దాదాపు 200 మంది చేరారు. తెదేపా, జనసేన, భాజపా నాయకులు పాల్గొన్నారు. రంగాభవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైకాపా నాయకులు తోటకూర వెంకట్రావు తన అనుయాయులు 75 మందితో తెదేపాలో చేరారు. వారికి దామచర్ల జనార్దన్‌ పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. మంత్రి శ్రీనివాసరావు, భాజపా నాయకులు యోగయ్య యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని