logo

దొరికినా నేరం కాదట.. విమర్శలకు తావిస్తున్న పోలీసుల తీరు

ఎన్నికల వేళ కొందరు పోలీసులు అధికార పార్టీకి ఎంత తొత్తులుగా పనిచేశారో అనేందుకు యర్రగొండపాలెంలో చోటుచేసుకున్న ఘటనే ఓ నిదర్శనం. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఈ నెల 13న పోలింగ్‌ బూత్‌లకు వెళ్తున్న ఓటర్లకు వైకాపా నాయకుడు శ్రీను డబ్బులు పంపిణీ చేస్తున్నారంటూ అధికారులకు తెదేపా నాయకులు ఫిర్యాదు చేశారు.

Updated : 18 May 2024 08:58 IST

వైకాపా నాయకుడు శ్రీను చేతిలో నగదు.. ఫొటో తీస్తున్న పోలీస్‌ సిబ్బంది

యర్రగొండపాలెం పట్టణం, న్యూస్‌టుడే: ఎన్నికల వేళ కొందరు పోలీసులు అధికార పార్టీకి ఎంత తొత్తులుగా పనిచేశారో అనేందుకు యర్రగొండపాలెంలో చోటుచేసుకున్న ఘటనే ఓ నిదర్శనం. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఈ నెల 13న పోలింగ్‌ బూత్‌లకు వెళ్తున్న ఓటర్లకు వైకాపా నాయకుడు శ్రీను డబ్బులు పంపిణీ చేస్తున్నారంటూ అధికారులకు తెదేపా నాయకులు ఫిర్యాదు చేశారు. ఆర్వో శ్రీలేఖ ఆదేశాల మేరకు ఏఆర్‌ అదనపు ఎస్పీ అశోక్‌బాబు తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని శ్రీనుని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద ఉన్న రూ.1.30 లక్షల నగదు, ఓటరు చీటీలు, జాబితాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మార్కాపురం మండలం గురిజేపల్లె వరకు తీసుకెళ్లి తిరిగి వై.పాలెంలో వదిలేశారు. డబ్బులు పంచుతూ పట్టుబడిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేయకపోవడంపై తెదేపా నాయకులు విమర్శిస్తున్నారు. ఈ విషయంపై ఇటీవల సీఐ రాములు నాయక్‌ను విలేకరులు ప్రశ్నించగా.. తమకు ఎవరూ ఫిర్యాదు చేయలేదని, తాము ఎవరినీ పట్టుకోలేదని చెప్పడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని