logo

వృద్ధురాలి హత్యకేసులో ఇద్దరి అరెస్ట్‌

ఇటీవల జరిగిన వృద్ధురాలి హత్య కేసుకు సంబంధించి ఇద్దరు నిందితులను మంగళవారం పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి కథనం ప్రకారం.. కొత్తపట్నంలోని రెడ్డిపాలెం గ్రామానికి చెందిన గుడిపల్లి నాగేశ్వరమ్మ(75) కల్లు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు.

Published : 22 May 2024 01:44 IST

కొత్తపట్నం, న్యూస్‌టుడే: ఇటీవల జరిగిన వృద్ధురాలి హత్య కేసుకు సంబంధించి ఇద్దరు నిందితులను మంగళవారం పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి కథనం ప్రకారం.. కొత్తపట్నంలోని రెడ్డిపాలెం గ్రామానికి చెందిన గుడిపల్లి నాగేశ్వరమ్మ(75) కల్లు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ నెల 18న అర్ధరాత్రి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో రెడ్డిపాలేనికి చెందిన నాగరాజు, నాంచార్లు కల్లు దొంగతనంగా తాగడానికి ఆమె ఇంటికి వెళ్లారు. ఆ తర్వాత కల్లు తాగి మత్తులో చోరీకి యత్నించారు. నిద్రిస్తున్న ఆమెను గొంతు నులిమి, ముక్కు మూసి ఊపిరాడకుండా చేసి హత్యకు పాల్పడ్డారు. అనంతరం ఆమె చెవికి ఉన్న రెండు గ్రాముల బంగారు ఆభరణాలు దొంగిలించారు. ఆ రోజునే ఏఎస్పీ శ్రీధర్‌రావు, డీఎస్పీ కిషోర్, సీఐ జగదీష్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ మేరకు విచారణ చేపట్టిన పోలీసులు అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించారు. నాగరాజు, నాంచార్లు వృద్ధురాలిని హత్య చేసినట్లు అంగీకరించడంతో వారిద్దరిని మంగళవారం పోలీసులు అరెస్ట్‌ చేశారు. అనంతరం రిమాండ్‌ నిమిత్తం ఒంగోలులోని కోర్టులో హాజరుపరిచారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని