logo

మాన్యం భూమిలో కబ్జా పర్వం

ప్రభుత్వ భూములు, మాన్యం భూములకు రక్షణ లేకుండా పోయింది. ఒంగోలు ఆశ్రమం సమీపంలోని పేర్నమిట్ట రెవెన్యూ పరిధిలోని మాన్యం భూమి కబ్జాల పాలవుతోంది.

Published : 22 May 2024 01:47 IST

వైకాపా నేత బరితెగింపు

ఒంగోలు ఆశ్రమం సమీపంలో వెలసిన కట్టడాలు

ఒంగోలు అర్బన్, న్యూస్‌టుడే: ప్రభుత్వ భూములు, మాన్యం భూములకు రక్షణ లేకుండా పోయింది. ఒంగోలు ఆశ్రమం సమీపంలోని పేర్నమిట్ట రెవెన్యూ పరిధిలోని మాన్యం భూమి కబ్జాల పాలవుతోంది. కొప్పోలుకు చెందిన ఓ వైకాపా నాయకుడు ఆ  భూమిలో ఏకంగా నిర్మాణాలు చేపట్టారు. అధికారులు ఎన్నికల కౌంటింగ్‌ ఏర్పాట్ల హడావుడిలో ఉండగా, ఆ నాయకుడు మాత్రం రెండు ఎకరాలకు ఫెన్సింగ్‌ వేసి చిన్నపాటి రేకుల షెడ్డు నిర్మించి దాని పక్కనే చిన్నపాటి నిర్మాణాలు చేపట్టాడు. ఇంత జరుగుతున్నా రెవెన్యూ అధికారులు తమకేమీ తెలియనట్లు వ్యవహరిస్తున్నారు. 

రూ.లక్షల విలువ చేసే..: పేర్నమిట్ట రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్‌  238లో సుమారు 15 ఎకరాల వరకు కుటుంబ నియంత్రణ చేసుకున్న పేదలకు మాన్యం భూమిగా ఇచ్చారు. దీనిపై క్రయ, విక్రయాలు చేయకూడదు. అయితే అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో రెండు ఎకరాల్లో నిర్మాణాలు  చేపట్టారు. బహిరంగ మార్కెట్లో దీని ధర రూ.లక్షల్లోనే పలుకుతోంది. దీనిపై తహసీˆల్దార్‌ మీరా వలీని వివరణ కోరగా, వీఆర్వోను పంపించి పనులను నిలిపివేసినట్లు తెలిపారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని