logo

ఓట్ల లెక్కింపు ఏర్పాట్ల పరిశీలన

జూన్‌ 4న నిర్వహించనున్న ఓట్ల లెక్కింపునకు అవసరమైన ఏర్పాట్లను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌ అధికారులను ఆదేశించారు.

Published : 22 May 2024 01:49 IST

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: జూన్‌ 4న నిర్వహించనున్న ఓట్ల లెక్కింపునకు అవసరమైన ఏర్పాట్లను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌ అధికారులను ఆదేశించారు. ఒంగోలు సమీపంలోని రైజ్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్‌ రూమ్‌లతో పాటు, అదే ప్రాంగణంలో ఓట్ల లెక్కింపునకు సంబంధించి చేస్తున్న ఏర్పాట్లను కలెక్టర్‌ మంగళవారం రాత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓట్ల లెక్కింపు గదుల వద్ద సిబ్బందికి, రాజకీయ పార్టీల ఏజెంట్లకు వేర్వేరుగా బారికేడ్లు ఏర్పాటు చేయాలన్నారు. ఓట్ల లెక్కింపు సిబ్బందికి గురువారం శిక్షణ నిర్వహించనున్నట్లు తెలిపారు. లెక్కింపునకు సంబంధించి బల్లలు ఏర్పాటు చేసే విషయంలో అధికారులకు పలు సూచనలు చేశారు. కలెక్టర్‌ వెంట డీఆర్వో శ్రీలత, పార్లమెంట్‌ ఏఆర్వో ఝాన్సీలక్ష్మి, గిద్దలూరు ఆర్వో నాగజ్యోతి, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు శ్రీనివాసరావు ఉన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని