logo

ఆగని వైకాపా నేతల ఆగడాలు

గిద్దలూరు నగర పంచాయతీ పాములపల్లె రహదారిలో మసీదు సమీపంలో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని వైకాపా నాయకులు ఆక్రమించేందుకు ప్రయత్నించారు.

Updated : 22 May 2024 05:29 IST

గిద్దలూరులో ప్రభుత్వ భూమి కబ్జాకు యత్నం

ఆక్రమించేందుకు ప్రభుత్వ స్థలంలో మట్టి పోసి ఇలా చదును చేశారు

గిద్దలూరు పట్టణం, న్యూస్‌టుడే: గిద్దలూరు నగర పంచాయతీ పాములపల్లె రహదారిలో మసీదు సమీపంలో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని వైకాపా నాయకులు ఆక్రమించేందుకు ప్రయత్నించారు. గతంలో ముస్లిం శ్మశాన వాటిక కోసం రెవెన్యూ అధికారులు అరెకరాకు పైగా స్థలాన్ని కేటాయించారు. ఆ సమీపంలో ఖాళీగా ఉన్న సుమారు ఎకరాన్నర స్థలాన్ని జీఎస్‌టీ డంపింగ్‌ యార్డు ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రతిపాదనలు చేశారు. అనంతరం ఆ విషయాన్ని విస్మరించారు. విలువైన స్థలం కావడంతో ఇప్పుడు ఖాళీగా ఉన్న సదరు స్థలంపై వైకాపా నాయకుల కన్ను పడింది. ఆక్రమించేందుకు పన్నాగం పన్నారు. ఈ క్రమంలో నేరుగా కాకుండా శ్మశాన వాటిక కోసమంటూ ప్రచారం సాగించారు. వాస్తవానికి ప్రజోపయోగ పనులకు కేటాయించాలనేదే ఉద్దేశమైతే అధికారులకు విన్నవించవచ్చు. అవేమీ చేయకుండా మట్టి తోలి చదును చేసే పనులను గత మూడు రోజులుగా కొనసాగిస్తున్నారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ సిబ్బంది మంగళవారం అక్కడి వెళ్లి మట్టి తోలి చదును చేయకుండా నిలిపివేయించారు. ఇప్పటికైనా నగర పంచాయతీ అధికారులు చొరవ తీసుకుని విలువైన ప్రభుత్వ స్థలాన్ని పరిరక్షించే దిశగా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని