logo

వేసవి చెరువులు ఖాళీ!

ఒంగోలు నగరంలోని తాగునీటి సమస్య తీవ్రస్థాయికి చేరింది. చెరువుల్లో నీరు 30 శాతానికి పడిపోయింది. దీంతో మోటార్లకు అందటం లేదు.. వీధుల్లోని చివరి కుళాయిలకు సరఫరా కావడం లేదు.

Published : 22 May 2024 01:59 IST

గణనీయంగా పడిపోయిన నీటి మట్టం
తాగునీటికి అల్లాడుతున్న నగర జనం

అడుగంటిన రామతీర్థం

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: ఒంగోలు నగరంలోని తాగునీటి సమస్య తీవ్రస్థాయికి చేరింది. చెరువుల్లో నీరు 30 శాతానికి పడిపోయింది. దీంతో మోటార్లకు అందటం లేదు.. వీధుల్లోని చివరి కుళాయిలకు సరఫరా కావడం లేదు. గంటన్నర పాటు రావాల్సిన నీరు అరగంటకే ఆగిపోతోంది. అవసరాలకు అనుగుణంగా సరఫరా లేకపోవడంతో జనం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొప్పోలులోని చెన్నకేశవస్వామి గుడి ఎదుట రెండు వీధుల వాసులు ఇటీవల ఖాళీ బిందెలతో రోడ్డెక్కి ఆందోళనకు దిగడం ఇందుకు నిదర్శనం. 

గుండ్లకమ్మ నుంచి నిలిచిన సరఫరా: ఒంగోలుకు రెండు వనరుల ద్వారా నీరు సరఫరా అవుతుంది. అందులో ఒకటైన గుండ్లకమ్మ జలాశయంలో నిల్వలు పడిపోయాయి. గత రెండు నెలలుగా అసలు రావడమే లేదు. మరో నీటి వనరు సాగర్‌ జలాలు. అవికూడా సకాలంలో విడుదల కావడం లేదు. దీంతో సమస్య తీవ్రమైంది. షెడ్యూల్‌ ప్రకారం ఏడాదిలో మూడుసార్లు సాగర్‌ జలాలు నగరానికి అందించాల్సి ఉంది. సాగర్‌ ప్రాజెక్టులో నీరు తక్కువగా ఉండటంతో మార్చిలో నీరు విడుదల కాలేదు. ఇటీవల రామతీర్థం జలాశయానికి అరకొరగా 0.5 మీటర్ల మేర విడుదల చేశారు. ఎన్నికల సమయంలో ప్రజాప్రతినిధులు పూర్తిస్థాయిలో నింపడంపై దృష్టిపెట్టలేదు. ఆ జలాశయం నుంచే ఒంగోలు, కందుకూరు, చీమకుర్తి పట్టణాలతో పాటు కొన్ని గ్రామాలకు కూడా సరఫరా చేయాల్సి ఉంది. దీంతో అవసరాలకు సరిపోయినంత నిల్వలు లేకపోయాయి. నీటి నిల్వలు తగ్గిపోవడం.. తద్వారా తలెత్తుతున్న ఇబ్బందులపై గురించి నగర పాలక సంస్థ అధికారులు ఇరిగేషన్‌ శాఖకు లేఖ రాశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని