logo

తెదేపాలో తిరుగుతున్నాడని బీరు సీసాతో దాడి

తెదేపాలో తిరుగుతున్నాడనే కారణంతో దళితుడిపై వైకాపా నాయకులు బీరుసీసాతో దాడి చేసిన సంఘటన పీసీపల్లి మండలం లక్ష్మక్కపల్లిలో శనివారం జరిగింది.

Published : 26 May 2024 01:19 IST

పీసీపల్లి, న్యూస్‌టుడే: తెదేపాలో తిరుగుతున్నాడనే కారణంతో దళితుడిపై వైకాపా నాయకులు బీరుసీసాతో దాడి చేసిన సంఘటన పీసీపల్లి మండలం లక్ష్మక్కపల్లిలో శనివారం జరిగింది. లింగన్నపాలేనికి చెందిన బాధితుడు ప్రభుదాస్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ద్విచక్రవాహనంపై వస్తుండగా లక్ష్మక్కపల్లికి చెందిన వైకాపా నాయకుడు, సర్పంచి మాలకొండయ్య, మరి కొంతమందితో కలిసి దారిలో ప్రభుదాస్‌ను అడ్డగించారు. తెదేపా వారితో ఎందుకు తిరుగుతున్నావంటూ ఘర్షణకు దిగి బీరు సీసాతో దాడి చేశారు. పీసీపల్లి ఎస్సై రమేష్‌బాబు మాట్లాడుతూ బాధితుడి నుంచి వివరాలు సేకరిస్తామన్నారు.


భార్య హత్య కేసులో భర్తకు యావజ్జీవ జైలు

ఒంగోలు న్యాయ విభాగం: అనుమానంతో భార్యను హత్య చేసిన కేసులో నిందితుడికి యావజ్జీవ జైలు శిక్ష విధిస్తూ ఒంగోలు ప్రిన్సిపల్‌ జిల్లా సెషన్స్‌ జడ్జి ఎ.భారతి... శనివారం తీర్పు ఇచ్చారు. జిల్లా కోర్టు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఎన్‌.వసుంధర తెలిపిన వివరాల ప్రకారం.. తాళ్లూరు మండలం కొర్రపాటివారిపాలేనికి చెందిన కొర్రపాటి ఏడుకొండలుకు... దర్శి మండలం వీరాయపాలేనికి చెందిన అంజలితో వివాహమైంది. వీరు తమ ముగ్గురు పిల్లలతో కలిసి... ఉపాధి నిమిత్తం ఒంగోలులో స్థిర పడ్డారు. ఏడుకొండలు ఆమెను అనుమానిస్తుండడంతో... దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో 2017 అక్టోబర్‌ 23 రాత్రి గొడవపడి రాయితో తలపై బలంగా కొట్టడంతో ఆమె చనిపోయింది. ఒంగోలు తాలూకా పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు పూర్వాపరాలు విచారించిన జిల్లా న్యాయమూర్తి... నేరం రుజువు కావడంతో నిందితుడికి యావజ్జీవ జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని