logo

వైకాపా నేతల దుష్ప్రచారంపై చర్యలు తీసుకోండి

బెంగళూరు రేవ్‌ పార్టీకి తాను డ్రగ్‌్్స సరఫరా చేశానంటూ సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరంగా కఠినచర్యలు తీసుకోవాలని తెదేపా యువనేత దామచర్ల సత్య కోరారు.

Published : 26 May 2024 01:21 IST

పోలీసులకు దామచర్ల సత్య ఫిర్యాదు

కొండపి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తున్న తెదేపా నాయకులు

ఒంగోలు నేరవిభాగం, టంగుటూరు, కొండపి గ్రామీణం, న్యూస్‌టుడే: బెంగళూరు రేవ్‌ పార్టీకి తాను డ్రగ్‌్్స సరఫరా చేశానంటూ సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరంగా కఠినచర్యలు తీసుకోవాలని తెదేపా యువనేత దామచర్ల సత్య కోరారు. ఈ మేరకు రాష్ట్ర డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తా, జిల్లా ఎస్పీ గురుడ్‌ సుమిత్‌ సునీల్‌కు ఫిర్యాదు చేశారు. తెదేపా అధినేత చంద్రబాబు, నారా లోకేష్‌ కుటుంబీకులతో తాను దిగిన ఫొటోలను వినియోగిస్తూ... కొందరు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. వైకాపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కారుమూరి వెంకటరెడ్డి అనే వ్యక్తి వీటిని ఫార్వార్‌్్డ చేసినట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదే విషయమై కొండపి నియోజకవర్గంలోని ఆరు మండలాల తెదేపా  అధ్యక్షులు, నాయకులు పోలీస్‌ స్టేషన్లలో శనివారం ఫిర్యాదు చేశారు.  దామచర్ల కుటుంబంపై అవాస్తవాలను పోస్ట్‌ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.  పోకూరి రవీంద్ర, చేరెడ్డి నరసారెడ్డి, వేల్పుల సింగయ్య, అనుమోలు సాంబశివయ్య, అబ్బూరి అభిషేక్‌ వసంత రాయుడు, రామ్మూర్తి నాయుడు, దామా మురళి, రామారావు, వెంకటేశ్వర్లు, జాను, అనుమోలు సాంబశివరావు, మండవ ప్రసాద్‌ తదితరులు ఫిర్యాదు చేసిన వారిలో ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని