logo

వింజవర్తిపాడు.. కూరగాయల ఊరు

ఏళ్లుగా చేస్తున్న వాణిజ్య పంటలు సాగు చేస్తున్నా కష్టపడుతున్నా చివరకు అప్పులే మిగులుతుండటంతో ఆ గ్రామస్థులను ఆలోచనలో పడేసింది.

Updated : 26 May 2024 04:25 IST

కరువులోనూ సిరులు
ఆదర్శంగా నిలుస్తున్న రైతులు

సాగులో గోరు చిక్కుడు పంట

కొనకనమిట్ల, న్యూస్‌టుడే: ఏళ్లుగా చేస్తున్న వాణిజ్య పంటలు సాగు చేస్తున్నా కష్టపడుతున్నా చివరకు అప్పులే మిగులుతుండటంతో ఆ గ్రామస్థులను ఆలోచనలో పడేసింది. అందరూ కలిసి ఆలోచించారు. కష్టాల నుంచి బయట పడే మార్గాన్ని అన్వేషించారు. అందరూ కూరగాయల సాగు వైపు మళ్లాలని నిర్ణయించారు. ఒకరికి మరొకరు తోడుగా నిలిచి కాలానుగుణంగా కాయగూర, ఆకుకూరలు పండిస్తూ లాభాల బాట పట్టారు. కరువు పరిస్థితుల్లోనూ సిరులు పండిస్తూ పలువురికి ఆదర్శంగా నిలిచారు. వారే వింజర్తిపాడు రైతులు.
 కొనకనమిట్ల మండలంలోని వింజవర్తిపాడు 200 ఎకరాల విస్తీర్ణంలో 125 మంది రైతులు వివిధ రకాల కూరగాయాలు సాగు చేస్తున్నారు. కాలానుగుణంగా పండించే దోస, పచ్చి మిరప, టమాట, గోరు చిక్కుడు, బెండ, దొండ, ఆకుకూరలు పండిస్తూ గ్రామానికి ప్రత్యేకం గుర్తింపు తెచ్చారు. పది సంవత్సరాల క్రితం వరకు గ్రామంలో అధికంగా పోగాకు, మిరప వాణ్యిజ పంటలు సాగు చేస్తూ నష్టలు రావడంతో కొంత మంది రైతులు ప్రయోగం గోరు చికుడు, క్యాబేజి కూరగాయలు సాగు చేశారు. కూరగాయల సాగులో లాభాలు రావడంతో తరువాత సంవత్సరం గ్రామంలో 150 కుటుంబాలు ఉద్యావన పంటలు సాగు చేయడంపై అవగాహన పెంచుకున్నారు. పండించిన పంటలను రాజమండ్రి, గుంటూరు, విజయవాడ, బేస్తవారపేట మార్కెట్లకు తరలిస్తున్నారు.

 పండిన దోసకాయలను చూపిస్తున్న శ్రీనువాసులు

కుటుంబాలు...  150
రైతులు .....     125
ప్రజలు....  600 మంది

నిత్య ఆదాయంతో భరోసా

గతంలో మా బోరులో అధికంగా నీరొచ్చేది. ప్రస్తుతం చాలా తక్కువగా వస్తోంది. దీంతో కూరగాయల సాగు చేపట్టా.  బిందు సేద్యం వల్ల వీటిని పొదుపు చేయగలుగుతున్నా. కూరగాయాల సాగుతో నిత్య ఆదాయం ఉంటుంది. కష్టానికి తగిన ఫలితం సాయంత్రానికి చేతికందుతుండటంతో ఆర్థిక ఇబ్బందులు నుంచి గట్టెక్కగలిగా.

వెంకటేశ్వర్లు, వింజవర్తిపాడు.

బిందుసేద్యంతో అధిక దిగుబడి

బెండ, బీర, వంకాయ, క్యాబేజీ వంటి కూరగాయాలను పండిస్తున్నా. బిందు సేద్యంతో నీటిని పొదుపు వాడుతున్నా. రూ. పదివేల పెట్టుబడితో ఎకరా భూమిలో దోసకాయలు, గోరుచిక్కుడు సాగు ప్రారంభించా. మూడు నెలు కాలంలోనే పదింతల ఆదాయాన్ని ఆర్జించా. ఎకరానికి వంద బస్తాలకు తగ్గకుండా దిగుబడి తీస్తున్నా.   

శ్రీనువాసులు, వింజవర్తిపాడు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని