logo

పర్యటకానికి పాతర

గుండ్లకమ్మ జలాశయం... గతంలో పర్యాటకులకు స్వర్గధామంలా ఉండేది. వారాంతాల్లో వందలాదిగా సందర్శకులు వచ్చేవారు. ఈ నేపథ్యంలోనే తెదేపా ప్రభుత్వ హయాంలో దాదాపు రూ.వంద కోట్ల వ్యయంతో ఈ ప్రాంతాన్ని పర్యటక ప్రాజెక్టుగా తీర్చిదిద్దేందుకు శ్రీకారం చుట్టారు.

Published : 27 May 2024 02:20 IST

జలాశయం మెట్టపై నిర్మించిన కాటేజీలు.. ధ్వంసమైన లోపలి  పరిసరాలు

గుండ్లకమ్మ జలాశయం... గతంలో పర్యాటకులకు స్వర్గధామంలా ఉండేది. వారాంతాల్లో వందలాదిగా సందర్శకులు వచ్చేవారు. ఈ నేపథ్యంలోనే తెదేపా ప్రభుత్వ హయాంలో దాదాపు రూ.వంద కోట్ల వ్యయంతో ఈ ప్రాంతాన్ని పర్యటక ప్రాజెక్టుగా తీర్చిదిద్దేందుకు శ్రీకారం చుట్టారు. కట్టల చుట్టూ పార్కులు తీర్చిదిద్దారు. పిల్లలు ఆడుకునేందుకు వీలుగా ఆట పరికరాలు, బోటు షికారు ఏర్పాటు చేశారు. రాత్రి వేళా సందర్శకులు బస చేసేందుకు వీలుగా... సమీపంలో కాటేజీలు, క్యాంటీన్, వ్యూ పాయింట్, ఈత కొలను వంటివి నిర్మించారు. తరువాత వచ్చిన వైకాపా ప్రభుత్వం... వీటిని అందుబాటులోకి తీసుకురాకుండా నిర్లక్ష్యం చేయడంతో కాటేజీలు రూపుకోల్పోయాయి. విద్యుత్తు పరికరాలు దొంగలు ఎత్తుకు పోయారు. తలుపులు, కిటికీలను సైతం ఆకతాయిలు ధ్వంసం చేసి... అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చారు. ఈ పరిసరాల్లో పిచ్చిమొక్కలు పెరిగి... మొత్తంగా ప్రాజెక్టే రూపుకోల్పోయింది.

ఈనాడు, ఒంగోలు

ఈతకొలను దుస్థితి 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని