logo

మురుగు తటాకం.. పక్కనే వైద్యం

ఈ చిత్రంలో కనిపిస్తున్నది వై.పాలెం ప్రభుత్వ వంద పడకల ఏరియా వైద్యశాల. పాత భవనం పక్కనే కొత్తగా రూ.23కోట్ల ఖర్చుతో మూడు అంతస్థులతో కొత్త భవనం నిర్మించారు.

Published : 27 May 2024 02:33 IST

ఎన్నికల కోడ్‌కు ముందు హడావుడిగా ప్రారంభం
అలాగే వదిలేసిన గుత్తేదారు

ప్రభుత్వవైద్యశాల ముందు పేరుకుపోయిన మురుగు నీరు

యర్రగొండపాలెం, న్యూస్‌టుడే: ఈ చిత్రంలో కనిపిస్తున్నది వై.పాలెం ప్రభుత్వ వంద పడకల ఏరియా వైద్యశాల. పాత భవనం పక్కనే కొత్తగా రూ.23కోట్ల ఖర్చుతో మూడు అంతస్థులతో కొత్త భవనం నిర్మించారు. అధికారపార్టీ నాయకుల ఒత్తిడితో పనులు అసంపూర్తిగా ఉండగానే ఎన్నికల కోడ్‌కు ముందు శిలాఫలకాలపై పేరు కోసం హడావుడిగా ప్రారంభించారు. పాత భవనం నుంచి కొత్త భవనంలోకి వైద్యసేవలు మార్చారు. అయితే, అయిదు ఎకరాల ప్రాంగణం మొత్తం గుంతలు ఏర్పడి ఎక్కడి మురుకు అక్కడే పేరుకుపోతోంది. వైద్యశాల ముందువైపు భారీ గుంత ఏర్పడి మురుగు చేరడంతో దుర్వాసనతోపాటు దోమల బెడదతో చికిత్స  కోసం వచ్చినవారు ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలోని ప్రధాన రహదారి డ్రైనేజీ నీరుసైం పొంగి వైద్యశాలలోకే చేరుతోంది. వర్షం  నీరు బయటకు వెళ్లేలా ప్రారంభానికి ముందే ప్రాంగణమంతా గ్రావెల్‌తో లెవెల్‌ చేయాల్సిన గుత్తేదారు సంస్థ పైపనులు గాలికొదిలేశారు.   నెలలు గడుస్తున్నా వైద్యశాల చుట్టూ అపరిశుభ్రత తాండవిస్తోంది. ఉన్నతాధికారులు పట్టించుకుని పరిశుభ్రతకు పెద్దపీట వేయాలని ప్రజలు కోరుతున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు