logo

పెరట్లో గంజాయి సాగు

ఈ చిత్రంలో కనిపిస్తున్నది ఏ పూల మొక్కో అనుకుంటే పొరపాటే. మత్తులో ముంచెత్తే గంజాయి ఇది. మార్కాపురం బాపూజీ కాలనీలో ఇవి వెలుగుచూశాయి. 

Published : 01 Dec 2022 03:06 IST

ఈ చిత్రంలో కనిపిస్తున్నది ఏ పూల మొక్కో అనుకుంటే పొరపాటే. మత్తులో ముంచెత్తే గంజాయి ఇది. మార్కాపురం బాపూజీ కాలనీలో ఇవి వెలుగుచూశాయి. ఈ ప్రాంతంలో రెండు వీధుల్లో నివసిస్తున్నవారికి మంగళవారం ఘర్షణ జరిగింది. దాసరి నాగమ్మ, దాసరి పేరయ్యలు తమ గృహాల్లోని పెరట్లో గంజాయి మొక్కలు సాగు చేస్తున్నట్లు స్థానిక ఎస్సై శశికుమార్‌కి సమాచారం అందింది. బుధవారం పోలీసులు వెళ్లి  మూడు మొక్కలను గుర్తించారు. నిందితులను అదుపులోకి తీసుకొని సెబ్‌ పోలీసులకు అప్పగించారు. మరోవైపు అక్కడే ఉండే శివ అనే వ్యక్తి కశాశాల విద్యార్థులు, యువతే లక్ష్యంగా గంజాయి విక్రయాలు సాగిస్తున్నా సెబ్‌ సిబ్బందికి తెలియలేదు. పోలీసుల రాకతో శివ పరారవగా...మిగిలిన ఇద్దరిపైన కేసు నమోదు చేసినట్లు ఎస్సై పద్మ తెలిపారు.

-న్యూస్‌టుడే, మార్కాపురం నేరవిభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని