logo

గిరిజన మైనర్ బాలికపై ముగ్గురు వ్యక్తుల అత్యాచారయత్నం

గిరిజన మైనర్ బాలికను ముగ్గురు వ్యక్తులు బలవంతంగా ఎత్తుకు వెళ్ళి అత్యాచారయత్నానికి ప్రయత్నించారు. వారి నుంచి తప్పించుకున్న బాలిక కుటుంబ సభ్యులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Published : 02 Dec 2023 00:18 IST

టంగుటూరు(సింగరాయకొండ), న్యూస్‌టుడే: గిరిజన మైనర్ బాలికను ముగ్గురు వ్యక్తులు బలవంతంగా ఎత్తుకు వెళ్ళి అత్యాచారయత్నానికి ప్రయత్నించారు. వారి నుంచి తప్పించుకున్న బాలిక కుటుంబ సభ్యులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన సింగరాయకొండ మండలం బింగినపల్లి గిరిజన కాలనీ సమీపంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. ఈ ఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఘటనకు సంబంధించి ఒంగోలు డీఎస్పీ నారాయణస్వామిరెడ్డి, సింగరాయకొండ సర్కిల్ సిఐ వివరాలు తెలిపారు. 

బింగినపల్లి గిరిజన కాలనీకి చెందిన మైనర్ బాలిక తల్లిదండ్రులు హైదరాబాదులో ఉంటూ బేల్దారి పనులకు వెళుతున్నారు. బాలిక స్థానికంగా తన అక్కతో కలిసి ఉంటోంది. అదే కాలనీకి చెందిన ప్రతాప్, హరి, వంశీలు గురువారం సాయంత్రం బాలికను బెదిరించి బలవంతంగా మారుమూల ప్రాంతానికి తీసుకువెళ్లారు. ఈ క్రమంలో ఆమెపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో సదురు బాలిక భయాందోళన చెంది వారి చేర నుంచి తప్పించుకుని ఇంటికి చేరింది. రాత్రంతా భయంతో గడిపిన బాలిక విషయాన్ని తన అక్కకు తెలిపింది. దీంతో వారు శుక్రవారం ఉదయం సింగరాయకొండ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అత్యాచారయత్నానికి ప్రయత్నించిన ముగ్గురు వ్యక్తుల్లో హరి వాలంటీర్‌గా ఉన్నాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని