logo

ఆ పాఠశాలలదంతా కనికట్టు

విద్యార్థులు లేకున్నప్పటికీ ఉన్నట్టు చూపుతూ ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేసుకోవాలని గిద్దలూరు, రాచర్లలోని కొన్ని ఎయిడెడ్‌ పాఠశాలల యాజమాన్యాలు ప్రయత్నించాయి.

Published : 02 Dec 2023 00:42 IST

చర్యలు తీసుకోవాలని అధికారుల ఆదేశాలు

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: విద్యార్థులు లేకున్నప్పటికీ ఉన్నట్టు చూపుతూ ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేసుకోవాలని గిద్దలూరు, రాచర్లలోని కొన్ని ఎయిడెడ్‌ పాఠశాలల యాజమాన్యాలు ప్రయత్నించాయి. ఆ మేరకు అన్‌ ఎయిడెడ్‌, ప్రైవేట్‌ బడుల నుంచి విద్యార్థులను తీసుకొచ్చి తరగతుల్లో కూర్చోబెట్టారు. తనిఖీకి వచ్చిన అధికారుల కళ్లకు కనికట్టు కట్టేందుకు ప్రయత్నించారు. తీరా విద్యాశాఖ డైరెక్టర్‌(అడ్మిన్‌) పార్వతి నేతృత్వంలోని బృందం సభ్యులు క్షుణ్నంగా పరిశీలించడంతో అసలు విషయం వెల్లడైంది. ఈ విషయాన్ని తెలుపుతూ ‘ఈనాడు’లో డామిట్‌ కథ అడ్డం తిరిగింది’ శీర్షికన నవంబర్‌ 20న ‘ఈనాడు’లో కథనం ప్రచురితమైంది. దీంతో ఉన్నతాధికారులు స్పందించారు. ఎయిడెడ్‌ పాఠశాలల పోస్టుల నియామకంలో అక్రమాలకు అడ్డుకట్ట వేసే దిశగా చర్యలు చేపట్టారు. విద్యాశాఖ అదనపు డైరెక్టర్‌ పార్వతి ఇచ్చిన నివేదిక మేరకు బోగస్‌ రోల్‌ చూపించిన గిద్దలూరులోని నాలుగు ఎయిడెడ్‌ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆ మేరకు విద్యాశాఖ డైరెక్టర్‌ కార్యాలయం నుంచి డీఈవోకు శనివారం ఉత్తర్వులిచ్చారు. ఇదిలా ఉండగా రోస్టర్‌ పాటించకుండా నిబంధనలకు విరుద్ధంగా ఎయిడెడ్‌ యాజమాన్యాలు.. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చర్యలు చేపడుతున్నాయంటూ బీసీ సంఘాల నాయకులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు