logo

కలల ఇళ్లు.. పశువుల నిలయాలు

ఇళ్లు.. కాలనీలు కాదు ఏకంగా ఊళ్లే నిర్మిస్తున్నామంటూ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి పదే పదే గొప్పలు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం  భిన్నంగా ఉన్నాయి.

Published : 02 Dec 2023 00:42 IST

ఇళ్లు.. కాలనీలు కాదు ఏకంగా ఊళ్లే నిర్మిస్తున్నామంటూ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి పదే పదే గొప్పలు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం  భిన్నంగా ఉన్నాయి. తాము నిర్మిస్తున్నట్లు ప్రకటిస్తున్న ఊళ్లలో ఇంకా ఇళ్ల నిర్మాణాలే పూర్తికాలేదు. చాలాచోట్ల లబ్ధిదారులు ఇటుకే వేయలేదు. అరకొరగా చేపట్టిన చోట్ల కూడా అసంపూర్తిగానే కనిపిస్తున్నాయి. అందుకు సింగరాయకొండ మండలం సోమరాజుపల్లి గ్రామ లేఅవుట్‌ నిదర్శనం. ఈ లేఅవుట్‌లో ఆ గ్రామానికి చెందిన సుమారు వెయ్యి మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందజేశారు. వీరిలో చాలా మంది ఇంటి నిర్మాణాలను కొంతమేర పూర్తి చేసి ఆపేశారు. మరి కొందరు అసలు ప్రారంభించనే లేదు. అడపాదడపా కురిసిన వర్షాలకు ఖాళీ స్థలాల్లో నీళ్లు నిలిచి చిన్నపాటి కుంటలను తలపిస్తున్నాయి. వాటిల్లో పశువులు సేద తీరుతూ ఇలా కనిపించాయి.

ఈనాడు, ఒంగోలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని