logo

ముఖ్యమంత్రి పర్యటనకు భారీ బందోబస్తు

శుక్రవారం నాటి ముఖ్యమంత్రి జగన్‌ పర్యటనకు జిల్లా పోలీసు యంత్రాంగం భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. హెలీప్యాడ్‌, సభావేదిక, పైలాన్ల వద్ద తనిఖీలు నిర్వహించారు.

Published : 24 Feb 2024 04:00 IST

ఐజీ ఆధ్వర్యంలో పర్యవేక్షణ

ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే: శుక్రవారం నాటి ముఖ్యమంత్రి జగన్‌ పర్యటనకు జిల్లా పోలీసు యంత్రాంగం భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. హెలీప్యాడ్‌, సభావేదిక, పైలాన్ల వద్ద తనిఖీలు నిర్వహించారు. హెలీప్యాడ్‌ వైపునకు కేవలం వీఐపీలు, ప్రముఖుల్ని తప్ప ఎవర్నీ అనుమతించలేదు. సభకు హాజరయ్యే వారికి సంబంధించిన బస్సులను ఒంగోలు కొత్త బైపాస్‌ నుంచి కొత్తపట్నం రోడ్డు మీదుగా సభాప్రాంగణం వద్దకు అనుమతించారు. కొత్త బైపాస్‌ నుంచి సభా ప్రాంగణం వరకు రోడ్డుకు ఇరువైపులా భారీగా పోలీసులు మోహరించారు. గుంటూరు రేంజి ఐజీ జి.పాలరాజు ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డి బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు. తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, పల్నాడు జిల్లాల నుంచి సుమారు 1,700మంది అధికారులు, సిబ్బందిని వినియోంచారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని