logo

శ్రీశైలానికి రాత్రిళ్లూ మార్గం సుగమం

ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైలంలో ఈ నెల 1 నుంచి 11వ తేదీ వరకు మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు.

Updated : 01 Mar 2024 05:41 IST

పెద్దదోర్నాల: ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైలంలో ఈ నెల 1 నుంచి 11వ తేదీ వరకు మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. వీటిని వీక్షించేందుకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం నల్లమలలో రాత్రి వేళ వాహనాల రాకపోకలను అనుమతిస్తున్నట్లు దోర్నాల అటవీ క్షేత్రాధికారి విశ్వేశ్వరరావు తెలిపారు. పెద్దదోర్నాల- శ్రీశైలం నల్లమల రహదారి పులుల అభయారణ్యం పరిధిలో ఉంది. దీంతో రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఇటుగా వాహనాల రాకపోకలను అనుమతించరు. పెద్దదోర్నాల అటవీ శాఖ చెక్‌పోస్టు వద్ద నిలిపివేస్తారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని వాహనాల రాకపోకలకు అనుమతిస్తున్నారు. చోదకులు పరిమిత వేగంతో, వన్యప్రాణులకు ఎలాంటి హాని కలగకుండా వాహనాలను నడపాలని ఆయన సూచించారు. నిబంధనలు పాటించకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని