logo

మట్టినీ వదలం

కవిటి మండలంలో యథేచ్ఛగా మట్టి తవ్వకాలు సాగుతున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా సాగిస్తున్న తవ్వకాలపై అధికారులు చర్యలకు ఉపక్రమించకపోవడంతో అక్రమార్కులు చెలరేగిపోతున్నారు

Updated : 19 Apr 2024 05:06 IST

యథేచ్ఛగా తవ్వకాలు

స్పందించని యంత్రాంగం

 

నెలవంక చెరువులో పొక్లెయిన్‌తో మట్టిని తవ్వి ట్రాక్టర్‌లో వేస్తున్న దృశ్యం

కవిటి గ్రామీణం, న్యూస్‌టుడే: కవిటి మండలంలో యథేచ్ఛగా మట్టి తవ్వకాలు సాగుతున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా సాగిస్తున్న తవ్వకాలపై అధికారులు చర్యలకు ఉపక్రమించకపోవడంతో అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. దీంతో చెరువులు, మెట్ట ప్రాంతాల రూపురేఖలు మారిపోతున్నాయి. గ్రామస్థాయి నాయకుల అండతో ఇది జరుగుతున్నట్లు తెలియడంతో అధికారులు అటువైపు చూడడం లేదు.

నిబంధనలకు పాతర..

ఒకచోట నుంచి మరోచోటుకు మట్టి తరలింపు, మెట్టప్రాంతాల్లో తవ్వకాలకు రెవెన్యూ, జల వనరుల శాఖ అధికారుల అనుమతులు తీసుకోవాలి. అలా తరలించే మట్టి వ్యవసాయ అవసరాలకు మాత్రమే వినియోగించాల్సి ఉంటుంది. ఇచ్ఛాపురం, కవిటి, కంచిలి, సోంపేట మండలాల్లో నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుపుతున్నారు. వాణిజ్య అవసరాలు, అక్రమ లేఅవుట్ల అభివృద్ధికి తరలిస్తున్నారు.

అనుమతులు ఇవ్వలేదు

ట్రాక్టర్‌ మట్టిని రూ.3 వందల నుంచి రూ.4 వందల వరకు విక్రయిస్తున్నారు. మట్టి ట్రాక్టర్లు నిరంతరం రాకపోకలు సాగిస్తుండడంతో సీసీ రహదారులతో పాటు పొలాలకు సంబంధించిన రోడ్లు ధ్వంసమవుతున్నాయి. ఈ విషయం జలవనరుల ఏఈఈ మధుసూధన పాణిగ్రహి దృష్టికి తీసుకెళ్లగా మట్టి తవ్వకాలకు ఎలాంటి అనుమతులివ్వలేదని తెలిపారు. విధిగా రెవెన్యూ, జలవనరుల శాఖ అనుమతులు తీసుకోవాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరిపినా, తరలించినా చర్యలు తీసుకుంటామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని