స్వతంత్ర అభ్యర్థులతో బోణీ..
సార్వత్రిక ఎన్నికల్లో తొలిఘట్టమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. శ్రీకాకుళం పార్లమెంట్ స్థానంతో పాటు, ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీచేసే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంది
తొలిరోజు నామినేషన్లకు దూరంగా ప్రధాన పార్టీల అభ్యర్థులు
పలాసలో నామినేషన్ల కోసం ఎదురు చూస్తున్న రిటర్నింగ్ అధికారి భరత్‌నాయక్, ఇతర అధికారులు
ఈనాడు డిజిటల్ శ్రీకాకుళం, న్యూస్‌టుడే, కలెక్టరేట్(శ్రీకాకుళం): సార్వత్రిక ఎన్నికల్లో తొలిఘట్టమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. శ్రీకాకుళం పార్లమెంట్ స్థానంతో పాటు, ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీచేసే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంది. ఇందులో భాగంగా తొలిరోజు ప్రధాన పార్టీల అభ్యర్థులెవరూ నామినేషన్లు దాఖలు చేయలేదు. వీరంతా ముహూర్తాలు కుదరక దూరంగా ఉన్నారు. స్వతంత్ర అభ్యర్థులు మాత్రమే నాలుగుచోట్ల నామపత్రాలు దాఖలు చేశారు.
నాలుగుచోట్ల ఆరుగురు
పలు శాసనసభ స్థానాల పరిధిలో ఆరుగురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. శ్రీకాకుళం, పలాస, పాతపట్నం, నరసన్నపేట నియోజకవర్గాల్లో ఒక్కటీ నమోదు కాలేదు. స్వతంత్ర అభ్యర్థులుగా ఆమదాలవలసలో ఇద్దరు, ఎచ్చెర్లలో ఇద్దరు, ఇచ్ఛాపురం, టెక్కలి నియోజకవర్గాల్లో ఒక్కొక్కరు చొప్పున వేశారు.
పార్లమెంట్ స్థానానికి ఒక్కటీ లేదు..
శ్రీకాకుళం పార్లమెంట్, శాసనసభ నియోజకవర్గాలకు నామినేషన్లు దాఖలు కాలేదు. ఈ రెండు స్థానాలు కలెక్టర్ కార్యాలయంలో ఉండటంతో బందోబస్తు ఏర్పాట్లు కూడా చేశారు. శ్రీకాకుళం డీఎస్పీ ఆధ్వర్యంలో ఒకటో పట్టణ సీఐ సన్యాసినాయుడు, ఎస్ఐ గణేష్ నామినేషన్ సమయం పూర్తయ్యే వరకు అక్కడే వేచి ఉండి కలెక్టర్ కార్యాలయంలోనికి వస్తున్న వాహనాలు, వ్యక్తులను ఆరా తీసి లోపలకు పంపారు. ఎక్కడా ఎలాంటి ఘటనలు లేకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాణ్యమైన విద్య వైద్యమే లక్ష్యం..!
[ 27-07-2024]
‘జిల్లాను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంది. ప్రతి ఎకరాకు సాగునీరు, నాణ్యమైన విద్య అందేలా చూడటం, మత్స్యకారుల వలసలు నియంత్రించడం, దీర్ఘకాలంగా తిష్ఠ వేసిన సమస్యలను పరిష్కరించాలని’ లక్ష్యంగా పెట్టుకున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. -
అయ్యో.. బాహుదా!
[ 27-07-2024]
ఇచ్ఛాపురం ప్రాంతంలో ఏటా అన్నదాతలకు సాగునీటి పరీక్ష తప్పడం లేదు. బాహుదా నదిలో గతంలో ఆరు నెలలు నీరు ఉండేది కాదు. -
ట్రిపుల్ ఐటీలో కౌన్సెలింగ్ ప్రారంభం
[ 27-07-2024]
రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలోని శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలకు శుక్రవారం కౌన్సెలింగ్ ప్రారంభమైంది. -
రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్‌సిటీ, న్యూస్‌టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్‌సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
అసెంబ్లీలో ఎవ·రేమన్నారంటే..?
[ 27-07-2024]
అమరావతి సచివాలయంలో శుక్రవారం జరిగిన శాసనసభ సమావేశాల్లో శ్రీకాకుళం, ఆమదాలవలస, ఇచ్ఛాపురం, ఎచ్చెర్ల ఎమ్మెల్యేలు గొండు శంకర్, కూన రవికుమార్, డాక్టర్ బెందాళం అశోక్, నడుకుదిటి ఈశ్వరరావు మాట్లాడారు. -
ప్రతిభ చూపితే భవిత నవోదయమే..!
[ 27-07-2024]
కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించే జవహర్ నవదోయ విద్యాలయంలో ప్రవేశానికి సమయం ఆసన్నమైంది. -
పలాసపురంలో అగ్నిప్రమాదం
[ 27-07-2024]
పలాసపురంలో శుక్రవారం అగ్నిప్రమాదం సంభవించింది. జరిగిన ప్రమాదంలో సంక రామారావు, బి.బైరాగి, బెందాళం మధు పశువుల పాకలు దగ్ధమయ్యాయి. -
చంద్రబాబుకు స్వాగతం
[ 27-07-2024]
నీతి ఆయోగ్ సమావేశానికి హాజరయ్యేందుకు వెళ్లిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని దిల్లీ విమానాశ్రయంలో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. -
సైనికుల సేవలు వెలకట్టలేనివి
[ 27-07-2024]
దేశానికి సైనికులు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని, వారి సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. -
పేదల అభ్యున్నతే జనసేన లక్ష్యం
[ 27-07-2024]
ప్రజాసంక్షేమం, పేదల అభ్యున్నతే జనసేన లక్ష్యమని ఆ పార్టీ నాయకుడు డాక్టర్ దానేటి శ్రీధర్ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల రోడ్డులో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. -
నిరుద్యోగులను మోసగించిన పంచాయతీ కార్యదర్శిపై విచారణ
[ 27-07-2024]
ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తానంటూ పలువురు నిరుద్యోగుల నుంచి పెద్దఎత్తున డబ్బులు వసూలు చేసి మోసం చేసిన మందస మండలం లొహరిబంద పంచాయతీ కార్యదర్శి ఎం.సతీష్‌ను జడ్పీ సీఈవో వెంకటేశ్వరరావు శుక్రవారం విచారించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్‌రెడ్డి హైదరాబాద్‌కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ