logo

నేడు 13 మండలాల్లో తీవ్ర వడగాలులు

జిల్లాలోని 13 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసినట్లు కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

Published : 24 Apr 2024 04:56 IST

కలెక్టరేట్‌ (శ్రీకాకుళం), న్యూస్‌టుడే: జిల్లాలోని 13 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసినట్లు కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆమదాలవలస, బూర్జ, జి.సిగడాం, పొందూరు, సరుబుజ్జిలి, నరసన్నపేట, జలుమూరు, టెక్కలి, కోటబొమ్మాళి, సారవకోట, పాతపట్నం, హిరమండలం, ఎల్‌.ఎన్‌.పేట మండలాల్లో తీవ్ర వడగాలులు, శ్రీకాకుళం, సోంపేట, రణస్థలం, సంతబొమ్మాళి, పోలాకి, పలాస, లావేరు, గార, ఎచ్చెర్ల, ఇచ్ఛాపురం, కంచిలి, కవిటి, కొత్తూరు, మందస, నందిగాం, మెళియాపుట్టి మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని చెప్పారు. మంగళవారం జిల్లాలో సారవకోట మండలంలో 43.7 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదైనట్లు పేర్కొన్నారు. 20 మండలాల్లో తీవ్ర వడగాలులు, 7 మండలాల్లో వడగాలులు వీచాయని వివరించారు. ప్రజలు వీలైనంత వరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంట్లోనే ఉండాలన్నారు. వృద్ధులు, గర్భిణులు, బాలింతలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని