logo

ఇది ఎన్నికల కోడ్‌కు విరుద్ధం కాదా..?

గార మండలం రామచంద్రాపురం పంచాయతీ జొన్నలపాడు గ్రామానికి చెందిన రేషన్‌ డీలరు రుప్ప శ్రీనివాసరావు మంగళవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గ్రా

Published : 24 Apr 2024 05:06 IST

రామ్‌మనోహర్‌నాయుడితో కలిసి ప్రచారంలో పాల్గొన్న రేషన్‌ డీలరు శ్రీనివాసరావు

శ్రీకాకుళం, న్యూస్‌టుడే: గార మండలం రామచంద్రాపురం పంచాయతీ జొన్నలపాడు గ్రామానికి చెందిన రేషన్‌ డీలరు రుప్ప శ్రీనివాసరావు మంగళవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గ్రామంలోని ఊరచెరువులో ఉపాధి పనులు జరుగుతుండగా వేతనదారులను ఓట్లు అభ్యర్థించేందుకు వెళ్లిన మంత్రి ధర్మాన కుమారుడు రామ్‌మనోహర్‌నాయుడు వెంట ఆయన ఉన్నారు. దీంతో శ్రీనివాసరావు వైఖరిపై పలువురు పెదవి విరుస్తున్నారు. ఆయన ఎంపీటీసీ సభ్యుడిగానూ వ్యవహరిస్తుండటం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని