logo

నేడు జిల్లాలో సీఎం పర్యటన

ముఖ్యమంత్రి జగన్‌ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో భాగంగా మంగళవారం జిల్లాకు వచ్చిన సందర్భంగా పైడిభీమవరం వద్ద వైకాపా శ్రేణులు ఘన స్వాగతం పలికాయి.

Published : 24 Apr 2024 05:07 IST

రణస్థలం కూడలిలో ప్రజలకు అభివాదం చేస్తున్న ముఖ్యమంత్రి జగన్‌

రణస్థలం, అరసవల్లి, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి జగన్‌ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో భాగంగా మంగళవారం జిల్లాకు వచ్చిన సందర్భంగా పైడిభీమవరం వద్ద వైకాపా శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. రాత్రి 8 గంటలకు జిల్లాలోకి బస్సు యాత్ర ప్రవేశించింది. అరిణాం అక్కివలసలో బసకు 8:40 నిమిషాలకు సీఎం చేరుకున్నారు. ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌, ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్‌ ఆయన వెంట ఉన్నారు. బుధవారం అరిణాం అక్కివలస నుంచి ముఖ్యమంత్రి టెక్కలి వెళ్లనున్నారు. ఎచ్చెర్ల, కుశాలపురం, శ్రీకాకుళం బైపాస్‌, నరసన్నపేట, ఎత్తురాళ్లపాడు మీదుగా కోటబొమ్మాళి చేరుకుని మధ్యాహ్నం 12 గంటలకు పరశురాంపురం గ్రామంలో భోజనం చేస్తారు. 4 గంటలకు బయలుదేరి 4:20కు అక్కివరం గ్రామంలో బహిరంగ సభలో పాల్గొంటారు. 5:30కు అక్కివరం నుంచి హెలీకాప్టర్‌లో బయలుదేరి 6:15కు విశాఖ చేరుకుంటారు. అక్కడ నుంచి 6:30కు గన్నవరం వెళ్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని