logo

ట్రాక్టరును ఢీకొన్న వ్యాను ఆరుగురికి తీవ్ర గాయాలు

లావేరు మండలం సుభద్రాపురం కూడలి సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

Published : 24 Apr 2024 05:08 IST

వ్యానులో చిక్కుకున్న వారిని బయటకు తీస్తున్న స్థానికులు

లావేరు, న్యూస్‌టుడే: లావేరు మండలం సుభద్రాపురం కూడలి సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయనగరం నుంచి శ్రీకాకుళం వస్తున్న వ్యాను.. అదుపుతప్పి ముందు వెళ్తున్న ట్రాక్టర్‌ను వెనుక నుంచి బలంగా ఢీకొంది. ప్రమాదంలో వ్యానులో ఉన్న ఐదుగురు మహిళలు, డ్రైవర్‌కు గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో విజయనగరంకు చెందిన స్వర్ణలత, భ్రమరాంబ, పద్మావతి, గజలక్ష్మి వీరంతా ఎచ్చెర్లలోని అంబేడ్కర్‌ గురుకుల విద్యాలయంలో ఉపాధ్యాయునిలుగా పని చేస్తున్నారు. సాయి పల్లవి శ్రీకాకుళంలో ఉన్న ఓ ప్రైవేటు దంత వైద్య కళాశాలలో చదువుతుంది. ప్రమాదంలో ఇద్దరు మహిళలు వ్యాను ముందు భాగంలో ఇరుక్కుపోవడంతో స్థానికులు వారిని బయటకు తీశారు. గాయపడిన వారిని శ్రీకాకుళం సర్వజన, ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు. ఘటనపై లావేరు ఎస్‌ఐ స్వామినాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు