logo

జగన్‌ సభకు జనాలను తరలించేందుకు ఏర్పాట్లు

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రకు బుధవారం శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ముగింపు పలకనున్నారు.

Published : 24 Apr 2024 05:10 IST

శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్సులో బస్సులేక వేచి ఉన్న ప్రయాణికులు

అరసవల్లి, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రకు బుధవారం శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ముగింపు పలకనున్నారు. ఈ సందర్భంగా అక్కడే వైకాపా నాయకులు సభ నిర్వహించనున్నారు. దానికి రాష్ట్ర నలుమూలల నుంచి జనాలను తీసుకొచ్చేందుకు ఆర్టీసీ బస్సులను సిద్ధం చేస్తున్నారు. రావులపాలెం, రాజమహేంద్రవరం, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, పాలకొండ, సాలూరు, కాకినాడ, పార్వతీపురం, అనకాపల్లి, తదితర డిపోల నుంచి సుమారు 1,100 బస్సులు టెక్కలికి వచ్చేలా కార్యాచరణ సిద్ధం చేశారు. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలోని నాలుగు డిపోల పరిధిలోని 190 బస్సులను మంగళవారం విజయనగరంలో జరిగిన సభకు పంపారు. దీంతో బస్సుల్లేక ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని