logo

23 మంది అభ్యర్థులు.. 29 నామినేషన్లు..!

జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగుతోంది. మరో రెండు రోజుల మాత్రమే గడువు ఉండటంతో అభ్యర్థులు నామపత్రాలు సమర్పించేందుకు ముందుకు వస్తున్నారు.

Published : 24 Apr 2024 05:26 IST

అసెంబ్లీ నియోజక వర్గాలకు 19 మంది..

ఆర్వో నవీన్‌కు నామపత్రం అందజేస్తున్న ఆమదాలవలస తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కూన రవికుమార్‌

కలెక్టరేట్‌(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగుతోంది. మరో రెండు రోజుల మాత్రమే గడువు ఉండటంతో అభ్యర్థులు నామపత్రాలు సమర్పించేందుకు ముందుకు వస్తున్నారు. మంగళవారం 8 అసెంబ్లీ, ఒక పార్లమెంట్ స్థానానికి మొత్తం 23 మంది అభ్యర్థులు 29 నామినేషన్లు దాఖలు చేశారు. వారిలో 24 మంది పురుషులు.. అయిదుగురు మహిళలు ఉన్నారు. కొంత మంది అభ్యర్థులు రెండు సెట్ల చొప్పున నామపత్రాలను అధికారులకు అందజేశారు.

తెదేపా తరఫున కింజరాపు అచ్చెన్నాయుడు(టెక్కలి), కింజరాపు విజయమాధవి(టెక్కలి), కూన రవికుమార్‌(ఆమదాలవలస), కూన ప్రమీల(ఆమదాలవలస), వైకాపా నుంచి ధర్మాన కృష్ణదాస్‌(నరసన్నపేట), బీఎస్పీ నుంచి వేదవర బిసాయి(ఇచ్ఛాపురం), చింతాడ శ్రీనివాసరావు(టెక్కలి), పాతపట్నం అభ్యర్థిగా కొప్పురౌతు వెంకటరావు(కాంగ్రెస్‌), సీపీఐ(ఎల్‌) అభ్యర్థిగా పి.కామేశ్వరరావు(పలాస), పాతపట్నం నుంచి గొల్ల తిరుపతిరావు(జేబీఎన్‌పీ), జన్ని సంజీవరావు(గొండ్వాన దండకారణ్య పార్టీ), పీపీఐ అభ్యర్థులుగా కర్రి లక్ష్మణరావు(శ్రీకాకుళం), ముద్దాడ మధుసూదనరావు(శ్రీకాకుళం), నవరంగ్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి కాయ కామేశ్వరి(శ్రీకాకుళం), స్వతంత్ర అభ్యర్థులుగా రాజాన మోహనరావు(పాతపట్నం), బగ్గు కృష్ణ(పాతపట్నం), సనపల సురేష్‌కుమార్‌(ఆమదాలవలస), గొర్లె కిరణ్‌కుమార్‌(ఎచ్చెర్ల), సువ్వారి రమ్య(ఎచ్చెర్ల) నామినేషన్లు దాఖలు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు