logo

మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య

పాతపట్నం మండలం కోదూరు గ్రామానికి చెందిన ఓ యువకుడు మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Published : 21 May 2024 03:12 IST

పాతపట్నం, న్యూస్‌టుడే: పాతపట్నం మండలం కోదూరు గ్రామానికి చెందిన ఓ యువకుడు మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కోదూరుకు చెందిన పాతూరు గోవిందరావు (26) ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేస్తూ భార్య వనితారాణి, కుమార్తె, కుమారుడిని పోషిస్తున్నాడు. మద్యానికి అలవాటు పడిన అతను భార్యతో తరచూ తగాదా పడుతున్నాడు. మద్యం తాగడం మానుకోవాలని భార్య మందలిస్తుండటంతో మనస్తాపానికి గురై ఆదివారం రాత్రి ఇంట్లో స్తంభానికి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తల్లి చిన్నమ్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏఎస్సై శ్రీనివాసరావు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. 


గుండెపోటుతో రైలు ప్రయాణికుడి మృతి

సికింద్రాబాద్, న్యూస్‌టుడే: ఉపాధి నిమిత్తం నగరానికి వస్తున్న ఓ ప్రయాణికుడు రైల్లోనే గుండెపోటుతో మృతి చెందాడు. సికింద్రాబాద్‌ జీఆర్పీ పోలీసుల వివరాల ప్రకారం... శ్రీకాకుళానికి చెందిన దుర్గారావు (45) స్థానికంగా పనులు లేకపోవడంతో మేడ్చల్‌ పరిధి ఎల్లంపేట్‌ వద్ద ఉంటున్న అల్లుడు శేఖర్‌ వద్దకు వచ్చి కూలీ పనిచేసుకుంటూ జీవనం సాగించేందుకు ఆదివారం గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో మరో బంధువుతో కలిసి బయలుదేరాడు. సోమవారం ఉదయం రైలు సికింద్రాబాద్‌కు చేరుకున్న సమయానికే అతడు గుండెపోటుతో మృతి చెందాడు. రైలు రద్దీ కారణంగా బంధువులు, అతను వేర్వేరు బోగీల్లో ప్రయాణించారు. రైలు దిగిన బంధువు దుర్గారావు కోసం వచ్చి చూడగా బోగీలోనే మృతిచెంది ఉన్నట్లు  గుర్తించి పోలీసులకు, అతని కుటుంబసభ్యులకు సమాచారం అందించాడు. పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రి శవాగారానికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు