logo

వైకాపా ఎంపీ అభ్యర్థి గృహ నిర్బంధం

వైకాపా శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్‌ను నందిగాం పోలీసులు సోమవారం ఆయన స్వగ్రామం కణితివూరులో గృహ నిర్బంధం చేశారు.

Published : 21 May 2024 03:15 IST

నందిగాం, న్యూస్‌టుడే: వైకాపా శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్‌ను నందిగాం పోలీసులు సోమవారం ఆయన స్వగ్రామం కణితివూరులో గృహ నిర్బంధం చేశారు. కోటబొమ్మాళి మండలం నిమ్మాడ పంచాయతీ చిన్నవెంకటాపురం గ్రామానికి చెందిన వైకాపా కార్యకర్త తోట మల్లేషు ఇటీవల జరిగిన గొడవల్లో గాయపడి, చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు ఎంపీ అభ్యర్థి బయలుదేరగా పోలీసులు గృహ నిర్బంధం చేశారు. కోటబొమ్మాళి మండలంలో 144 సెక్షన్‌ అమల్లో ఉన్నందున  తిలక్‌ అక్కడకు వెళ్తే గొడవలు జరిగే అవకాశం ఉన్నందున అడ్డుకున్నట్లు ఎస్సై మహమ్మద్‌ అమీర్‌ ఆలీ పేర్కొన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని