logo

పార్టీ మారారని నీటి సరఫరా నిలిపివేత

వైకాపా నుంచి తెదేపాలోకి మారామని కక్ష గట్టి పైపులైన్‌ మరమ్మతుల పేరిట నీటి సరఫరాను నిలిపేశారంటూ గ్రామానికి చెందిన వజ్జ లోకేశ్వరరావు ఎంపీడీవో జి.భాస్కరరావుకు ఫిర్యాదు చేశారు.

Published : 21 May 2024 03:17 IST

ఎంపీడీవోకు బాధితుడి ఫిర్యాదు

మెళియాపుట్టి, న్యూస్‌టుడే: వైకాపా నుంచి తెదేపాలోకి మారామని కక్ష గట్టి పైపులైన్‌ మరమ్మతుల పేరిట నీటి సరఫరాను నిలిపేశారంటూ గ్రామానికి చెందిన వజ్జ లోకేశ్వరరావు ఎంపీడీవో జి.భాస్కరరావుకు ఫిర్యాదు చేశారు. కరజాడ గ్రామంలో ఇటీవల వైకాపా నుంచి తెదేపాలో చేరి ఎన్నికల్లో అధికార పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినందుకు గ్రామ సర్పంచి కక్ష గట్టి ఇంటింటికీ వచ్చే నీటి సరఫరాను నిలిపివేశారని ఆరోపించారు. ఎన్నికలకు ముందే పైపులైన్‌ మరమ్మతుల పేరుతో గోతులు తీసి నీటి సరఫరాను అడ్డుకున్నారు. గత పది రోజులుగా ఇదిగో.. అదిగో అంటూ కాలయాపన చేస్తున్నారని వాపోయారు. తమ ఇంటితో పాటు వజ్జ నందమ్మ, బమ్మిడి చక్రపాణిల ఇళ్లకు కూడా నీటి సరఫరా నిలిచిపోయిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సమస్యపై సోమవారం మండలాధికారుల దృష్టికి తీసుకురావడంతోనే గ్రామంలోకి పోలీసులు వచ్చి స్టేషన్‌కు రావాలంటూ పిలిచారని ‘న్యూస్‌టుడే’ వద్ద వాపోయారు. ఈ విషయమై గ్రామ పంచాయతీ సర్పంచి పున్నయ్యను అడగగా పైపులైన్‌ సమస్య ఉందని, మరమ్మతులు చేపట్టేందుకే గోతులు తీసినట్లు, మంగళవారం పనులు పూర్తిచేస్తామని, వాళ్లు రాజకీయంగా ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని