logo

29 కేంద్రాల్లో 50 శాతం లోపే..!

శ్రీకాకుళం నియోజకవర్గంలో కీలకమైన నగరంలో పోలింగ్‌ శాతం ఆశించిన స్థాయిలో లేదు. మొత్తం 279 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా కొన్ని చోట్ల 50 శాతం కంటే తక్కువ నమోదైంది.

Published : 21 May 2024 03:20 IST

పోలింగ్‌కు దూరంగా నగర వాసులు
న్యూస్‌టుడే, కలెక్టరేట్‌(శ్రీకాకుళం)

శ్రీకాకుళం నియోజకవర్గంలో కీలకమైన నగరంలో పోలింగ్‌ శాతం ఆశించిన స్థాయిలో లేదు. మొత్తం 279 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా కొన్ని చోట్ల 50 శాతం కంటే తక్కువ నమోదైంది. అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా ఆశించిన స్థాయిలో ఓటర్లు ముందుకు రాకపోవడం గమనార్హం. 

  • శ్రీకాకుళం నియోజకవర్గంలో నగరం, గ్రామీణ మండలం, గార మండలాలకు సంబంధించి 139 ప్రాంతాల్లో 279 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. గార మండలంలో 75, శ్రీకాకుళం నగరంలో 115, గ్రామీణ మండలంలో 89 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. శ్రీకాకుళం నగరంలోని 29 కేంద్రాల్లో 50 శాతం కంటే తక్కువగా.. 53 చోట్ల 50 నుంచి 60 శాతం మధ్య పోలింగ్‌ నమోదైంది.
  • శ్రీకాకుళం నియోజకవర్గంలో 68.31 శాతం పోలింగ్‌ నమోదైంది. ఓటింగ్‌ శాతం తక్కువగా నమోదైన కేంద్రాలన్నీ నగర పరిధిలోవే. గార మండలం, శ్రీకాకుళం గ్రామీణ మండలంలో ఓటర్లు పెద్దఎత్తున ఓటు హక్కు వినియోగించుకోవడం విశేషం.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని