logo

ఓట్ల లెక్కింపునకు పక్కా ఏర్పాట్లు

జిల్లాలో ఓట్ల లెక్కింపునకు సంబంధించి పక్కా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన్‌ అధికారులను ఆదేశించారు.

Published : 21 May 2024 03:30 IST

కలెక్టరేట్‌ (శ్రీకాకుళం), న్యూస్‌టుడే: జిల్లాలో ఓట్ల లెక్కింపునకు సంబంధించి పక్కా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌ కార్యాలయంలోని ఆయన ఛాంబరులో సోమవారం ఎన్నికల రిటర్నింగ్, పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. శాంతిభద్రతల దృష్ట్యా జిల్లాలో 144 సెక్షన్‌ కొనసాగించాలని స్పష్టం చేశారు. పటిష్ట భద్రతా చర్యలు తీసుకోవాలన్నారు. డీఎస్పీలు సమన్వయ సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. వివిధ ప్రాంతాల్లో పండగలు జరుగుతున్న నేపథ్యంలో సమూహాలు ఉండకూడదన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడానికి వీల్లేదని స్పష్టం చేశారు. బాణసంచా విక్రయించకుండా లైసెన్సులు ఉన్న యజమానులకు నోటీసులు జారీ చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు.  ఎస్పీ రాధిక, పలువురు అధికారులు  పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని