logo

వెంకన్న దర్శనం.. భక్తజన పారవశ్యం..

నరసన్నపేట వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం స్వామివారు శేష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.

Published : 21 May 2024 03:33 IST

న్యూస్‌టుడే, నరసన్నపేట : నరసన్నపేట వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం స్వామివారు శేష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రాంగణం నుంచి ప్రారంభమైన తిరువీధిలో పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. పెద్దపేట, కొత్తబస్టాండ్, పాతబస్టాండ్, కాలేజ్‌ రోడ్డు మీదుగా సాగిన తిరువీధిలో గోవిందనామ స్మరణ మారుమోగింది. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈనెల 18 నుంచి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.  


గరుడ వాహనంపై గోవిందుడు

న్యూస్‌టుడే, శ్రీకాకుళం సాంస్కృతికం, గుజరాతీపేట : శ్రీకాకుళం నగరం పీఎన్‌ కాలనీలోని నారాయణ తిరుమల వెంకటేశ్వరస్వామి ఆలయం వార్షిక కల్యాణోత్సవాల్లో భాగంగా సోమవారం శ్రీవారిని రజత కవచంతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం గరుడ వాహనంపై భూ నీల సమేత వెంకటేశ్వరస్వామి తిరువీధి ఉత్సవం వైభవంగా నిర్వహించారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని