logo

పాలిసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల

ఏపీ పాలిసెట్‌-2024కు హాజరైన విద్యార్థులకు కళాశాలల్లో సీట్లు కేటాయింపునకు సంబంధించి వెబ్‌ బేస్‌డ్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల చేసినట్లు పాలిసెట్‌ జిల్లా సహాయ కేంద్రం సమన్వయకర్త జి.దామోదరరావు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.

Published : 24 May 2024 04:54 IST

ఎచ్చెర్ల, న్యూస్‌టుడే: ఏపీ పాలిసెట్‌-2024కు హాజరైన విద్యార్థులకు కళాశాలల్లో సీట్లు కేటాయింపునకు సంబంధించి వెబ్‌ బేస్‌డ్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల చేసినట్లు పాలిసెట్‌ జిల్లా సహాయ కేంద్రం సమన్వయకర్త జి.దామోదరరావు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రవేశ పరీక్షకు హాజరైన విద్యార్థులు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ రుసుము చెల్లించి నిర్దేశించిన తేదీల్లో ధ్రువపత్రాల పరిశీలనకు శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన సహాయ కేంద్రానికి హాజరుకావాలని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.250, ఓసీ, బీసీ విద్యార్థులు రూ.700 రుసుము జూన్‌ 2లోగా చెల్లించాలన్నారు. ధ్రువపత్రాల పరిశీలన పూర్తయిన విద్యార్థులు కళాశాల, బ్రాంచ్‌ ఎంపికలకు అవకాశమిస్తారన్నారు. జూన్‌ 5న కళాశాలలు, బ్రాంచ్‌లు మార్చుకునేందుకు వీలుంటుందని వివరించారు. జూన్‌ 7న కళాశాలలు, బ్రాంచ్‌ల ఎంపిక జాబితా వెల్లడిస్తారని స్పష్టం చేశారు. పూర్తి సమాచారానికి https://appolycet.nic.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలన్నారు.

గురుకులాల్లో ప్రవేశాలకు తేదీల్లో మార్పు..

శ్రీకాకుళం అర్బన్, న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి మిగులు సీట్ల భర్తీ నిర్వహించనున్న స్పాట్‌ కౌన్సెలింగ్‌ తేదీల్లో మార్పు చేసినట్లు జిల్లా సమన్వయ అధికారి ఎన్‌.బాలాజీ నాయక్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 28న దుప్పలవలసలో 5వ తరగతి బాలురకు, 30న ఇంటర్‌ విద్యార్థులకు, 29న ఎచ్చెర్లలో 5వ తరగతి బాలికలకు, 31న ఇంటర్‌ విద్యార్థినులకు స్పాట్‌            కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని