logo

హవ్వా.. ఇది బస్టాండా

జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ కాంప్లెక్సు పరిస్థితి దయనీయంగా మారింది. నిత్యం వేల మంది ప్రయాణికులు బస్సుల్లో రాకపోకలు సాగించేందుకు ఇక్కడికి వస్తుంటారు.

Published : 24 May 2024 05:04 IST

రెండో డిపో వద్ద కాలువలో పేరుకుపోయిన వ్యర్థాలు

జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ కాంప్లెక్సు పరిస్థితి దయనీయంగా మారింది. నిత్యం వేల మంది ప్రయాణికులు బస్సుల్లో రాకపోకలు సాగించేందుకు ఇక్కడికి వస్తుంటారు. వారికి కాంప్లెక్స్‌  వద్దకు రాగానే సమస్యలే స్వాగతం పలుకుతున్నాయి. ఎక్కడపడితే అక్కడ చెత్తతో పరిసరాలు అధ్వానంగా తయారయ్యాయి. ఆవరణలోని కాలువల్లో వ్యర్థాలు పేరుకుపోయి మురుగు పారే పరిస్థితి కూడా లేదు.

బస్సుల ప్లాట్‌ఫాం వద్ద ద్విచక్ర వాహనాల పార్కింగ్‌

ప్రయాణికుల నుంచి సెస్‌ వసూలు చేస్తున్న అధికారులు మౌలిక సదుపాయాల కల్పన విషయంలో పట్టించుకోవడం లేదు. కాలువలు శిథిలావస్థకు చేరి.. వర్షం పడితే ఏటా కాంప్లెక్స్‌ నీట మునుగుతున్నా స్పందన లేదు.. ప్రతిరోజూ శుభ్రం చేస్తున్న దాఖలాలు కూడా లేకుండా పోయాయి. పర్యవేక్షణ లేకపోవడంతో కొందరు బస్సులు ఆగే ప్లాట్‌ఫాం  వద్ద ద్విచక్ర వాహనాలను అడ్డంగా పార్కింగ్‌ చేస్తున్నారు. రాత్రి వేళ మందుబాబులు మద్యం తాగుతూ.. ఖాళీ సీసాలను అక్కడే పడేసి ప్రయాణికులకు అసౌకర్యం కలిగిస్తున్నారు.

ఆవరణలో చెత్త ఇలా......

మరుగుదొడ్ల సదుపాయమూ అంతంతమాత్రంగానే ఉండటంతో మహిళలు ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయమై స్టేషన్‌ మేనేజర్‌ ఎల్‌.ఎస్‌.నాయుడు మాట్లాడుతూ కాంప్లెక్స్‌ ఆవరణను శుభ్రం చేయిస్తామని చెప్పారు. బయటప్రాంతాల నుంచి వచ్చేవారు రాత్రి వేళ మద్యం తాగి సీసాలను పడేసి వెళ్లిపోతున్నారని, పర్యవేక్షణ పెంచుతామని చెప్పారు.

కాంప్లెక్స్‌ ఆవరణలో ఖాళీ మద్యం సీసాలు

 న్యూస్‌టుడే, అరసవల్లి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని