logo

మార్మోగిన గోవింద నామస్మరణ..

శ్రీకాకుళం నగరం, నరసన్నపేటలో శ్రీనివాసుని వార్షిక కల్యాణ మహోత్సవాలు, బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.. నారాయణ తిరుమల వెంకటేశ్వరస్వామి సన్నిధిలో గురువారం ప్రత్యేక పూజలు చేశారు.

Published : 24 May 2024 05:08 IST

నారాయణ తిరుమలలో పుష్పయాగం

శ్రీకాకుళం నగరం, నరసన్నపేటలో శ్రీనివాసుని వార్షిక కల్యాణ మహోత్సవాలు, బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.. నారాయణ తిరుమల వెంకటేశ్వరస్వామి సన్నిధిలో గురువారం ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం అర్చకులు శ్రీనివాసులు నిర్వహణలో భూనీలా సమేత శ్రీవారి ఉత్సవమూర్తులను అలంకరించి వేదమంత్రాలు, మంగళధ్వనులతో పుష్పయాగం  నిర్వహించారు.

నరసన్నపేటలో గరుడ వాహనంపై ఊరేగుతున్న శ్రీవారు

నరసన్నపేటలో తొలుత స్వామికి ప్రత్యేక పూజలు, ఊంజల్‌ సేవ చేశారు. అనంతరం ఆలయం నుంచి భక్తుల గోవింద నామస్మరణ మధ్య తిరువీధి ఆరంభమైంది. పలు ప్రధాన వీధుల మీదుగా గరుడ వాహన సేవ జరిగింది. ప్రముఖ ఆధ్యాత్మిక   ప్రచారకులు రాధా మనోహర్‌ దాస్‌ ముఖ్యఅతిథిగా పాల్గొనగా, విశ్వహిందూ పరిషత్‌కు చెందిన జిల్లా ప్రముఖులు హాజరయ్యారు.

 న్యూస్‌టుడే, గుజరాతీపేట, శ్రీకాకుళం సాంస్కృతికం, నరసన్నపేట

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు