logo

ఈ సారైనా నీరు అందుతుందా..!

ఖరీఫ్‌కు రైతులంతా సమాయత్తమవుతున్నా.. మరోవైపు బెంగ తప్పడం లేదు. వంశధార నీరు సాగు అందుతుందా లేదా అన్నది ఒక ఆందోళన అయితే.. వంశధార కాలువ పూర్తిగా పూడికలతో నిండి అధ్వానంగా మారింది.

Published : 26 May 2024 02:11 IST

పాతటెక్కలి వద్ద ఇదీ వంశధార కాలువ దుస్థితి

వజ్రపుకొత్తూరు గ్రామీణం, న్యూస్‌టుడే: ఖరీఫ్‌కు రైతులంతా సమాయత్తమవుతున్నా.. మరోవైపు బెంగ తప్పడం లేదు. వంశధార నీరు సాగు అందుతుందా లేదా అన్నది ఒక ఆందోళన అయితే.. వంశధార కాలువ పూర్తిగా పూడికలతో నిండి అధ్వానంగా మారింది. ముఖ్యంగా పాతటెక్కలి వద్ద వంశధార కాలువలో స్థానికులు బొప్పయి మొక్కలు వేసుకుని పండిస్తున్నారు. కాలువపై పూర్తి పర్యావేక్షణ లేకపోవడంతో పలు చోట్ల ఆక్రమణలకు గురయ్యాయి. కాలువ గట్లపై పలువురు కూరలసాగు చేపడుతున్నారు. వజ్రపుకొత్తూరు మండలంలో విస్తరించి ఉన్న వంశధార కాలువలు ఈఏడాదైనా సకాలంలో మరమ్మత్తులు చేపట్టి పంటలకు పూర్తిస్థాయిలో నీరందించే చర్యలు తీసుకుంటే బాగుంటుందని అభిప్రాయ పడుతున్నారు. ఆ దిశగా సాగునీరు అందించే చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. ఈ విషయమై వంశధార శాఖ ఈఈ శ్రీకాంత్‌ మాట్లాడుతూ.. ఈ ఏడాది ఖరీఫ్‌ లోపల కాలువల అభివృద్ధికి కృషి చేస్తామని వెల్లడించారు.

కాలువలో బొప్పాయి చెట్లు  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని