logo

వాయుగుండం ప్రభావం

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావం జిల్లాలోని పలు మండలాలపై కనిపించింది.. శనివారం మధ్యాహ్నం నుంచి ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి, నరసన్నపేట నియోజకవర్గాల పరిధిలో వాతావరణంలో మార్పులు సంభవించాయి.

Published : 26 May 2024 02:32 IST

కవిటి: ఈదురు గాలులకు కారుపై కూలిన వృక్షం  

న్యూస్‌టుడే, కవిటి గ్రామీణం, సారవకోట : బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావం జిల్లాలోని పలు మండలాలపై కనిపించింది.. శనివారం మధ్యాహ్నం నుంచి ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి, నరసన్నపేట నియోజకవర్గాల పరిధిలో వాతావరణంలో మార్పులు సంభవించాయి. ఇచ్ఛాపురం, కవిటి, సోంపేట మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. ఉరుములు, పిడుగులు భయపించాయి. పలుచోట్ల ఓ మోస్తరు వర్షం కురిసింది.  కవిటిలోని అశోక్‌ థియేటర్‌ సమీపంలోని చెట్టు కారుపై కూలింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం దెబ్బతింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు