logo

15 ఏళ్ల తర్వాత జిల్లాలో క్రికెట్‌ పోటీలు

సుదీర్ఘ విరామం అనంతరం అంతర్‌ జిల్లాల క్రికెట్‌ పోటీలు జిల్లాలో జరగనున్నాయి. దాదాపు 15 ఏళ్ల తర్వాత జరగనున్న ఈ పోటీలకు టెక్కలి సమీపంలోని ఆదిత్య ఇంజినీరింగ్‌ కళాశాల ఆతిథ్యం ఇవ్వనుంది.

Published : 26 May 2024 02:34 IST

ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు
ఐతమ్‌ వేదికగా అండర్‌-19, 23 నార్త్‌జోన్‌ మ్యాచ్‌లు

మైదానాన్ని పరిశీలిస్తున్న జిల్లా క్రికెట్‌ సంఘ ప్రతినిధులు 

న్యూస్‌టుడే, టెక్కలి  : సుదీర్ఘ విరామం అనంతరం అంతర్‌ జిల్లాల క్రికెట్‌ పోటీలు జిల్లాలో జరగనున్నాయి. దాదాపు 15 ఏళ్ల తర్వాత జరగనున్న ఈ పోటీలకు టెక్కలి సమీపంలోని ఆదిత్య ఇంజినీరింగ్‌ కళాశాల ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ నెల 31 నుంచి అండర్‌- 19 నార్త్‌ జోన్, జూన్‌ 15 నుంచి అండర్‌-23 నార్త్‌జోన్‌ వన్‌డే పోటీలు జరగనున్నాయి. ఈ మేరకు శనివారం జిల్లా క్రికెట్‌ సంఘం కార్యదర్శి హసన్‌రాజాషేక్, కోశాధికారి సైలానీ, మెంటార్‌ ఇలియాస్‌ అహ్మద్, సెలక్టర్‌ ఆర్‌.సి.రెడ్డి మైదానాన్ని పరిశీలించారు. ఈ పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామని తెలిపారు. వీటి ద్వారా జిల్లాలోని ఔత్సాహిక క్రీడాకారులకు మెరుగైన అవకాశాలు లభిస్తాయన్నారు. టోర్నమెంట్‌ కన్వీనరుగా ఎన్‌.లాల్‌ బహదూర్‌ వ్యవహరిస్తారని చెప్పారు.

అండర్‌- 19 జిల్లా జట్టు ఇదే..

నార్త్‌జోన్‌ పోటీల్లో పాల్గొనే జిల్లా జట్టును సంఘ ప్రతినిధులు ప్రకటించారు. వి.ప్రద్నీష్‌సాయి(కెప్టెన్‌), ఎన్‌.సుశాంత్, సిద్దు విఘ్నేష్, జయరాం, గోపాలకృష్ణ, ఎన్‌.రాజ్‌కుమార్, సాయిసుజన్, పూర్ణచంద్ర, జున్నారావు, ఎం.రోహిత్, థామస్‌ రామ్‌కుమార్, నవీన్‌ కుమార్‌రెడ్డి, కల్యాణ్‌కుమార్, వినీల్‌సాగర్, అభయ్, డి.సిద్ధు.

స్టాండ్‌బైస్‌ : వి.కృష్ణ, వి.మోహనరావు, అభినయ్, వినయ్‌చంద్ర, పూజారి దానిష్, భరత్‌కుమార్‌ ఎంపికయ్యారు. జట్టు కోచ్, మేనేజరుగా మేఘనాథ్, నార్త్‌జోన్‌ సెలక్టర్‌గా బొడ్డేపల్లి వర్ధన్‌ వ్యవహరించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు