logo

రూ.80 కోట్లతో పోర్టు పునరావాస కాలనీ

సంతబొమ్మాళి మండలంలోని నౌపడ, మూలపేట, విష్ణుచక్రం గ్రామాల్లో 600 కుటుంబాలకు రూ.80 కోట్లతో పోర్టు పునరావాస కాలనీ ఏర్పాటుకు ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపినట్లు టెక్కలి సబ్‌కలెక్టర్‌ రాహుల్‌కుమార్‌ రెడ్డి పేర్కొన్నారు.

Published : 03 Feb 2023 03:05 IST

అధికారులకు సూచనలిస్తున్న టెక్కలి సబ్‌కలెక్టర్‌ రాహుల్‌కుమార్‌రెడ్డి

సంతబొమ్మాళి, న్యూస్‌టుడే: సంతబొమ్మాళి మండలంలోని నౌపడ, మూలపేట, విష్ణుచక్రం గ్రామాల్లో 600 కుటుంబాలకు రూ.80 కోట్లతో పోర్టు పునరావాస కాలనీ ఏర్పాటుకు ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపినట్లు టెక్కలి సబ్‌కలెక్టర్‌ రాహుల్‌కుమార్‌ రెడ్డి పేర్కొన్నారు. సంతబొమ్మాళి మండలంలోని నౌపడ గ్రామంలో ఏర్పాటు చేయనున్న పునరావాస కాలనీ భూములను శుక్రవారం పరిశీలించారు. రోడ్లు రూ.15 కోట్లు, విద్యుత్తు రూ.3 కోట్లు, ప్రభుత్వ కార్యాలయాలు రూ.5 కోట్లు, 56 ఎకరాల భూముల విలువ రూ.15 కోట్లు, గృహనిర్మాణానికి రూ.25 కోట్లు, ఇతర సదుపాయాలకు రూ.17 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు పంచాయతీరాజ్‌ డీఈ శ్రీనివాస్‌కుమార్‌, విద్యుత్తుశాఖ డీఈఈ రాజశేఖర్‌, ఇతర అధికారులు సబ్‌కలెక్టర్‌ దృష్టికి తీసుకొచ్చారు. ఇప్పటివరకు 35 ఎకరాల్లో రైతులు భూములు ఇవ్వడానికి ముందుకొచ్చారని, మరో 25 ఎకరాల భూములను త్వరలో సేకరిస్తున్నట్లు తహసీల్దార్‌ చలమయ్య తెలిపారు. పోర్టు పునరావాస కాలనీకి భూములు ఇచ్చిన రైతులకు వారం రోజుల్లో పరిహారం అందజేస్తామని సబ్‌కలెక్టర్‌ తెలిపారు. మిగిలిన భూములు సేకరించాలని అధికారులను సూచించారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని