వేధిస్తున్న స్టాంపుల కొరత
సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రూ.100 నాన్ జ్యుడీషియల్ స్టాంపుల కొరత ఏర్పడటంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
రణస్థలంలో స్టాంపుల కోసం వేచి ఉన్న కొనుగోలుదారులు
న్యూస్‌టుడే, రణస్థలం: సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రూ.100 నాన్ జ్యుడీషియల్ స్టాంపుల కొరత ఏర్పడటంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారం రోజులుగా ప్రైవేటు వ్యక్తులను ఆశ్రయిస్తున్నారు. దీంతో లైసెన్సుదారులు రెట్టింపు ధరలకు విక్రయిస్తున్నారు. రణస్థలం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలో వారం రోజులుగా రూ.100 స్టాంపులు లభించడం లేదు. భూసర్వే నేపథ్యంలో వంశపారంపర్యంగా వచ్చిన భూమి తల్లిదండ్రుల పేరిట ఉంటే పిల్లల పేరు విభజించడానికి గిఫ్ట్‌డీడ్ రాసుకోవాలని రెవెన్యూ సిబ్బంది సూచిస్తున్నారు. గ్రామాల్లోని రైతులు స్టాంపుల కొనుగోలుకు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి వస్తుండటంతో కొరత ఏర్పడింది.
గిరాకీ ఉండటంతోనే.. జిల్లా రిజిస్ట్రార్ మన్మధరావు మాట్లాడుతూ ఈ ఏడాది గిరాకీ అధికం కావడంతో రూ.వంద స్టాంపులకు కొరత ఏర్పడిందని తెలిపారు. మిగతా స్టాంపులు వినియోగించవచ్చన్నారు. లైసెన్సుదారులు అధిక ధరలకు విక్రయించడానికి వీలు లేదని స్పష్టం చేశారు. ఎక్కువ మొత్తానికి అమ్ముతున్న వారిపై ఫిర్యాదు చేస్తే లైసెన్సు రద్దు చేస్తామని చెప్పారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Crime News : కుమార్తెను చంపి ‘కరెంట్ షాక్’ నాటకం
-
Ap-top-news News
Andhra News: ఆసుపత్రి భవనానికి వైకాపా రంగులు..!
-
India News
పానీపూరీ అమ్ముతున్న లేడీ డాక్టర్!.. ఇలా చేయడం వెనుక పెద్ద కారణమే
-
Politics News
నన్ను ఓడించేందుకు ప్రయత్నాలు జరిగాయి: మంత్రి పువ్వాడ అజయ్
-
Ts-top-news News
ఉచిత వై-ఫైతో ఏసీ స్లీపర్ బస్సులు
-
Movies News
దేవుడితో పని పూర్తయింది!.. పవన్‌తో కలిసి ఉన్న వర్కింగ్ స్టిల్‌ను పంచుకున్న సముద్రఖని