logo

బ్రహ్మపుర వరకు పలాస పాసింజర్‌ రైలు

ఇచ్ఛాపురం నియోజకవర్గ ప్రజలకు పాసింజర్‌ రైలు సౌకర్యం సమకూరనుంది. ఈ ప్రాంతం నుంచి విశాఖ వెళ్లి వచ్చేందుకు వీలుగా పాసింజర్‌ రైలు లేకపోవడంతో పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Published : 28 Feb 2024 03:53 IST

మార్చి ఒకటి నుంచి రాకపోకలు

సోంపేట, న్యూస్‌టుడే: ఇచ్ఛాపురం నియోజకవర్గ ప్రజలకు పాసింజర్‌ రైలు సౌకర్యం సమకూరనుంది. ఈ ప్రాంతం నుంచి విశాఖ వెళ్లి వచ్చేందుకు వీలుగా పాసింజర్‌ రైలు లేకపోవడంతో పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కిడ్నీ బాధితులు వేకువజామున బస్సుల్లో వెళ్లేందుకు వ్యయ ప్రయాసలకు గురవుతున్నారు. ఎట్టకేలకు పలాస పాసింజర్‌ రైలును వచ్చే నెల ఒకటో తేదీ నుంచి బ్రహ్మపుర వరకు పొడిగిస్తూ రైల్వే అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. బ్రహ్మపుర వరకు పొడిగించేందుకు కృషిచేసిన ఎంపీ కె.రామ్మోహన్‌నాయుడు, రైల్వే అధికారులకు తెదేపా నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. రైలును బారువ ఆర్‌.ఎస్‌. (కొర్లాం)లో నిలిపేలా చర్యలు తీసుకోవాలని జాగృతి స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు రాంబుడ్డి గణపతి అధికారులను కోరారు. 

సమయాలు ఇలా.. : బ్రహ్మపురలో తెల్లవారుజామున 3.50 గంటలకు బయలుదేరుతుంది. ఇచ్ఛాపురం (4.09), సోంపేట (4.22), మందస (4.33) పలాస (5.00), విశాఖపట్నం (9.20) చేరుతుంది. తిరిగి విశాఖలో సాయంత్రం 5.45కు బయలుదేరి రాత్రి ఇచ్ఛాపురం (10.31) బ్రహ్మపురకు (10.47) చేరుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని