logo

పాలకులు నింపిన చీకట్లు..!

హిరమండలంలోని గొట్టాబ్యారేజీ నిర్వహణను ప్రభుత్వం గాలికొదిలేసింది. 450 మీటర్ల పొడవున్న బ్యారేజీ వద్ద 22 స్పిల్‌వే, 2 అత్యవసర గేట్లు ఉన్నాయి. గతంలో ప్రతి రెండు గేట్ల మధ్య సోడియం విద్యుద్దీపాలు అమర్చారు.

Published : 28 Feb 2024 03:55 IST

హిరమండలంలోని గొట్టాబ్యారేజీ నిర్వహణను ప్రభుత్వం గాలికొదిలేసింది. 450 మీటర్ల పొడవున్న బ్యారేజీ వద్ద 22 స్పిల్‌వే, 2 అత్యవసర గేట్లు ఉన్నాయి. గతంలో ప్రతి రెండు గేట్ల మధ్య సోడియం విద్యుద్దీపాలు అమర్చారు. వీటి నిర్వహణకు ఏటా నిధులొచ్చేవి. వైకాపా అధికారంలోకి వచ్చాక నిధుల్లేక పాడైన దీపాలను పట్టించుకోవడం మానేశారు. ఫలితంగా రాత్రి వేళ బ్యారేజీ వద్ద అంధకారం అలముకుంటోంది.  ఆంధ్రా నుంచి ఒడిశాకు ఇదే ప్రధాన మార్గం. నిత్యం వందలాది వాహనాలు దీనిపై నుంచి రాకపోకలు సాగిస్తాయి. రాత్రివేళ కారుచీకట్ల కారణంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ‘నిర్వహణ నిధులకు ప్రతిపాదించాం. మంజూరైన వెంటనే దీపాలు వేసేందుకు చర్యలు తీసుకుంటాం’ అని వంశధార ఎస్‌ఈ డోల తిరుమలరావు పేర్కొన్నారు.

న్యూస్‌టుడే, హిరమండలం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు