logo

ప్రభుత్వంపై అసంతృప్తికి నిదర్శనం

జిల్లా కేంద్రంలో సోమవారం జరిగిన రా కదలిరా సభకు తరలివచ్చిన అశేష జనవాహిని వైకాపా ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న అసంతృప్తికి నిదర్శనమని తెదేపా శ్రీకాకుళం పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు కూన రవికుమార్‌ అన్నారు.

Published : 28 Feb 2024 03:57 IST

మాట్లాడుతున్న కూన రవికుమార్‌

గుజరాతీపేట(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: జిల్లా కేంద్రంలో సోమవారం జరిగిన రా కదలిరా సభకు తరలివచ్చిన అశేష జనవాహిని వైకాపా ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న అసంతృప్తికి నిదర్శనమని తెదేపా శ్రీకాకుళం పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు కూన రవికుమార్‌ అన్నారు. ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం జగన్‌రెడ్డి సభలకు బస్సుల్లో జనాలను తరలిస్తున్నారని, అందుకు భిన్నంగా తెదేపా సభకు వేలాదిమంది స్వచ్ఛందంగా వచ్చారని చెప్పారు. వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెదేపా నాయకులు, కార్యకర్తలపై దాడులకు పాల్పడటంతో అంతా విసిగిపోయారని, ప్రజల్లో ఇదే భావన ఉందన్నారు. చంద్రబాబు పర్యటనను విజయవంతం చేసేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో తెదేపా సీనియర్‌ నాయకుడు పీఎంజే బాబు, బొనిగి భాస్కరరావు, సింతు సుధాకర్‌, ఎస్‌.వి.రమణమాదిగ, మాదారపు వెంకటేష్‌, రామరాజు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని