logo

పాతపట్నం గొంతెండుతోంది..!

పాతపట్నం మండలానికి నలుదిశలా నదులు, గెడ్డలు ప్రవహిస్తున్నప్పటికీ ఓవైపు ప్రకృతి వైపరీత్యం, మరోవైపు ప్రభుత్వ నిర్లక్ష్యం వెరసి ప్రజలకు తాగునీటికి ఇబ్బందులు తప్పలేదు.

Published : 28 Feb 2024 04:12 IST

న్యూస్‌టుడే, పాతపట్నం

పాతపట్నం వద్ద మహేంద్రతనయలో అడుగంటిన నీరు

పాతపట్నం మండలానికి నలుదిశలా నదులు, గెడ్డలు ప్రవహిస్తున్నప్పటికీ ఓవైపు ప్రకృతి వైపరీత్యం, మరోవైపు ప్రభుత్వ నిర్లక్ష్యం వెరసి ప్రజలకు తాగునీటికి ఇబ్బందులు తప్పలేదు. నాలుగు నెలలుగా వర్షాల్లేక మండల ప్రజలు నీటిఎద్దడిని ఎదుర్కొంటున్నారు. అధికశాతం తాగునీటి అవసరాలను తీర్చే మహేంద్రతనయ నది, గుమ్మగెడ్డ ఇప్పటికే ఎండుముఖం పట్టాయి.

రక్షిత, మెగా పథకాలు ఉన్నా..

పాతపట్నం మండలంలో అధికశాతం గ్రామాల గొంతు తడిపేందుకు వంశధార, మహేంద్రతనయ నదులు, గుమ్మగెడ్డ పరివాహక ప్రాంతాల్లో రక్షిత, మెగా తాగునీటి పథకాలు ఉన్నప్పటికీ ఇప్పటికే పడకేశాయి. మెగా తాగునీటి పథకం ద్వారా సీది, తీమర, తామర, కొరసవాడ, కాగువాడ, బూరగాం, పాతపట్నం మేజర్‌ పంచాయతీలకు తాగునీరు సరఫరా చేయాల్సి ఉన్నా రహదారి విస్తరణలో పైప్‌లైన్‌ను తొలగించడంతో నీటి పంపిణీ నిలిచిపోయింది. గతంలో వినియోగించిన రక్షిత పథకాలపైనే ఆధారపడాల్సిన పరిస్థితి. పాతపట్నం నుంచి సీది వరకు ఉన్న మహేంద్రతనయ నదిలో నీటి నిల్వలు నిండుకున్నాయి. నదిలో వేసిన బోర్ల ద్వారా అరకొర నీటి సరఫరా జరుగుతోంది. పాతపట్నంలో పూర్తిస్థాయిలో ఇంటింటికీ కుళాయిలు లేకపోవడంతో వచ్చిన నీటితోనే సరిపెట్టుకోవాల్సిన దుస్థితి. కాగువాడకు అవసరమైన రక్షిత నీటిపథకం మహేంద్రతనయలోనే ఉంది. భూగర్భ జలాలు అడుగంటడంతో ఒక బోరు నుంచి నీరు రావడం లేదు. సీది, తీమర, తామర పంచాయతీలకు మహేంద్రతనయ నదిలో కలిసే గుమ్మగెడ్డ కాలువలో బోర్లు వేసి రక్షిత పథకాలు నిర్వహిస్తున్నారు. కొన్ని నెలలుగా గుమ్మగెడ్డలో నీటి నిల్వలు లేవు. వేసవిలో ఇబ్బందులు తప్పవని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘నదుల్లో నీటి నిల్వలు తగ్గాయి. ఈ వేసవిలో నీటి సమస్యను పరిష్కరించేందుకు తగిన చర్యలు చేపడతాం. అవసరమైతే ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తాం.’ అని ఆర్‌డబ్ల్యూఎస్‌ జేఈ కల్యాణ్‌రామ్‌ పేర్కొన్నారు.

నిరుపయోగంగా మెగా పథకం ట్యాంకు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని