logo

గవర్నర్‌ పదవి త్యజించడం మంచిదే: తమిళిసై

తెలంగాణ గవర్నర్‌ పదవికి రాజీనామా చేయడం మంచిదే అనిపిస్తోందని దక్షిణ చెన్నై భాజపా అభ్యర్థి తమిళిసై సౌందరరాజన్‌ తెలిపారు. కోయంబేడు శివాలయం నుంచి బుధవారం ఎన్నికల ప్రచారం ప్రారంభించిన సందర్భంగా ఆమె విలేకర్లతో మాట్లాడారు.

Updated : 28 Mar 2024 08:45 IST

తోపుడుబండి వద్ద వడ తింటున్న తమిళిసై సౌందరరాజన్‌

చెన్నై, న్యూస్‌టుడే: తెలంగాణ గవర్నర్‌ పదవికి రాజీనామా చేయడం మంచిదే అనిపిస్తోందని దక్షిణ చెన్నై భాజపా అభ్యర్థి తమిళిసై సౌందరరాజన్‌ తెలిపారు. కోయంబేడు శివాలయం నుంచి బుధవారం ఎన్నికల ప్రచారం ప్రారంభించిన సందర్భంగా ఆమె విలేకర్లతో మాట్లాడారు. రోడ్డు వెంట ఉన్న ఓ దుకాణంలో వడలు కొని తిన్నానని, దుకాణదారుడు డిజిటల్‌ పేమెంట్‌ నిర్వహిస్తున్నారని తెలిపారు. మోదీ ప్రభుత్వం గురించి ఇంతకన్నా ఇంకెలా చెప్పాలని ప్రశ్నించారు. నాలుగున్నరేళ్ల తర్వాత ప్రజలను ఇలా కలుసుకుంటున్నానని చెప్పారు. ప్రజలు ఉత్సాహంగా ఆహ్వానించడాన్ని చూస్తుంటే గవర్నర్‌ పదవికి రాజీనామా చేయడం మంచిదే అనిపిస్తోందని పేర్కొన్నారు. సాయంత్రం వేళచ్చేరిలోని తండిశ్వరం రోడ్డులో ఓటర్ల మద్దతు కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని