నటుడు మన్సూర్ అలీఖాన్‌కు అస్వస్థత.. పండ్లరసంలో విషం కలిపారని ఆరోపణ
వేలూర్ నియోజక వర్గ స్వతంత్ర అభ్యర్థి, నటుడు మన్సూర్ అలీఖాన్ అస్వస్థతకు గురయ్యారు. బుధవారం ప్రచారానికి చివరిరోజు కావడంతో ముమ్మరంగా ఓట్లు అభ్యర్థించారు.
చికిత్స పొందుతున్న మన్సూర్ అలీఖాన్
ఆర్కేనగర్, న్యూస్‌టుడే: వేలూర్ నియోజక వర్గ స్వతంత్ర అభ్యర్థి, నటుడు మన్సూర్ అలీఖాన్ అస్వస్థతకు గురయ్యారు. బుధవారం ప్రచారానికి చివరిరోజు కావడంతో ముమ్మరంగా ఓట్లు అభ్యర్థించారు. ఆ సమయంలో అకస్మాత్తుగా అస్వస్థతతకు లోనవడంతో వెంటనే గుడియాత్తంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స తర్వాత చెన్నై కేకేనగర్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. తనకు పండ్లరసంలో ఎవరో విషం కలిపి ఇచ్చారని మస్సూర్ అలీఖాన్ ప్రకటన విడుదల చేశారు. అందులో.. గుడియాత్తం సంత నుంచి ఇంటికి బయలుదేరుతున్నప్పుడు దారిలో కొందరు పండ్లరసం, మజ్జిగ ఇచ్చారన్నారు. పండ్లరసం తాగిన కొద్ది నిమిషాలకే కళ్లు తిరిగి గుండెల్లో నొప్పి వచ్చిందన్నారు. ప్రస్తుతం చెన్నైలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నానని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మరణాల రేటు అక్కడే ఎందుకు పెరుగుతోంది?
[ 27-07-2024]
2018 నుంచి 2022 వరకు రాష్ట్రంలో చోటుచేసుకున్న మరణాలపై ఆరోగ్యశాఖ ప్రత్యేకంగా పరిశోధించింది. 2018 నుంచి ఏటా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మరణాలు రేటు బాగా పెరుగుతూ వచ్చింది. -
విజయాన్ని సూచించే వేడుకలు
[ 27-07-2024]
కార్గిల్ విజయ్ దివస్ మనకు గర్వకారణమైన విజయాన్ని సూచించే జాతీయ వేడుకలని గవర్నర్ ఆర్.ఎన్.రవి తెలిపారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా కామరాజర్ రోడ్డులోని వార్ మొమోరియల్కు శుక్రవారం నివాళులర్పించారు. -
తమిళనాడు హౌస్‌లో నిర్మాణాలకు శంకుస్థాపన
[ 27-07-2024]
దిల్లీలోని తమిళనాడు హౌస్ ప్రాంగణంలోని పాత భవనాలు కూల్చివేసి వాటి స్థానంలో రూ.267 కోట్లతో కొత్తగా చేపట్టనున్న నిర్మాణాలకు ముఖ్యమంత్రి స్టాలిన్ శంకుస్థాపన చేశారు. -
వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలి
[ 27-07-2024]
దేశ యువత సాంస్కృతిక రాయబారులుగా ఉండాలని కోరుకున్న స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలని పూర్వ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. -
మిన్మిని ఆడియో, ట్రైలర్ విడుదల
[ 27-07-2024]
హలితా షమీమ్ దర్శకత్వంలో కతిజా రహ్మాన్, గౌరవ్ కాళై, ఎస్తేర్ అనిల్ తదితరులు నటించిన చిత్రం ‘మిన్మిని’. ఆగస్టు 9న విడుదల కానున్న ఈ చిత్రం ట్రైలర్, ఆడియో విడుదల వేడుక గురువారం జరిగింది. -
సింగపూర్ ఓడ ప్రమాదం
[ 27-07-2024]
పుదుకోట్టె జిల్లా మేట్టుపట్టికి చెందిన చెల్లకన్ను కుమారుడు షణ్ముగం (26) బీఎస్సీ చదివి రెండేళ్ల క్రితం సింగపూర్‌లో హార్బర్లో సరకుల ఎగుమతి, దిగుమతి విభాగంలో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్‌రెడ్డి హైదరాబాద్‌కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్‌లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం