logo

ట్రాన్స్‌జెండర్లకు పాస్‌పోర్ట్‌ మంజూరు వ్యవహారం

లింగ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న ట్రాన్స్‌జెండర్లు పాస్‌పోర్డ్‌ కావాలంటే చికిత్స పొందిన ఆస్పత్రి అందజేసే ధ్రువపత్రం దాఖలు చేయాలన్న నిబంధనను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌పై జవాబు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని మద్రాసు హైకోర్టు ఆదేశించింది.

Published : 22 Apr 2024 01:10 IST

కేంద్రం జవాబు కోరిన హైకోర్టు

ప్యారిస్‌, న్యూస్‌టుడే: లింగ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న ట్రాన్స్‌జెండర్లు పాస్‌పోర్డ్‌ కావాలంటే చికిత్స పొందిన ఆస్పత్రి అందజేసే ధ్రువపత్రం దాఖలు చేయాలన్న నిబంధనను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌పై జవాబు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని మద్రాసు హైకోర్టు ఆదేశించింది. మైలాపూర్‌కి చెందిన శివకుమార్‌ దాఖలు చేసిన పిటిషన్‌లో... శస్త్రచికిత్స ద్వారా ట్రాన్స్‌జెండర్లుగా మారే వారు పాస్‌పోర్టు పొందాలంటే ఆస్పత్రి అందజేసే ధ్రువపత్రం దాఖలు చేయాలన్న నిబంధన రాజ్యాంగం కల్పించిన సమానత్వ హక్కుకు వ్యతిరేకమన్నారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులకు విరుద్ధం కావున ధ్రువపత్రాన్ని జతచేయాలన్న విభాగాన్ని రద్దు చేయాలని కోరారు. ఈ పిటిషన్‌ శనివారం చీఫ్‌ జస్టిస్‌ గంగాపూర్వాలా, జస్టిస్‌ భరత చక్రవర్తి ధర్మాసనంలో విచారణకు వచ్చింది. సహజంగా ట్రాన్స్‌జెండర్లు అయిన వారికి ఈ నిబంధన వర్తించదని, అదే సమయంలో లింగమార్పిడి శస్త్రచికిత్స ద్వారా ట్రాన్స్‌జెండర్లుగా మారే వారికి శస్త్రచికిత్స చేసిన ఆస్పత్రి ధ్రువపత్రం తప్పనిసరి అని కేంద్ర ప్రభుత్వం తరఫున తెలిపారు. అనంతరం పిటిషన్‌పై జవాబు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించి తదుపరి విచారణను 29కి వాయిదా వేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని