logo

ఉరుసు ఉత్సవంలో పాల్గొన్న ఏఆర్‌ రెహమాన్‌

చెంగల్పట్టు జిల్లా మహాబలిపురం సమీపంలోని హజరత్‌ మహ్మద్‌ షా ఖాదిరి వలివుల్లా దర్గా ఉరుసు ఉత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు.

Published : 22 Apr 2024 01:29 IST

దర్గాలో ప్రార్థనలు చేస్తున్న ఏఆర్‌ రెహమాన్‌

మహాబలిపురం, న్యూస్‌టుడే: చెంగల్పట్టు జిల్లా మహాబలిపురం సమీపంలోని హజరత్‌ మహ్మద్‌ షా ఖాదిరి వలివుల్లా దర్గా ఉరుసు ఉత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఉత్సవంలో పాల్గొన్న ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. చెన్నై, తిరువళ్లూర్‌, కాంచీపురం, చెంగల్పట్టు, కల్పాక్కం, తిరుక్కళి కుండ్రం, మహాబలిపురం మొదలైన ప్రాంతాల నుంచి ముస్లింలు భారీ సంఖ్యలో తరలివచ్చారు.


నటుడు విజయ్‌పై 10 వేల వరుసల్లో కవిత

36 గంటల్లో రాసి ఓ అభిమాని రికార్డు

సైదాపేట, న్యూస్‌టుడే: ప్రముఖ నటుడు విజయ్‌ కోసం 36 గంటల్లో 10 వేల వరుసల్లో ఓ అభిమాని కవిత రాశాడు. నటుడు విజయ్‌కి తమిళనాడు మాత్రమే కాకుండా పుదుచ్చేరి, కేరళలో అధిక సంఖ్యలో అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం వెంకట్‌ప్రభు దర్శకత్వంలో ‘ది గోట్‌’ సినిమాలో విజయ్‌ నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో 2004లో విడుదలైన ‘గిల్లి’ (తెలుగులో ఒక్కడు) 20 సంవత్సరాల తర్వాత శనివారం రీరిలీజ్‌ అయింది. ఈ సందర్భంగా తిరుపత్తూరుకు చెందిన విజయ్‌ అభిమాని కదిర్‌వేల్‌ విజయ్‌ గురించి 36 గంటల్లో 10 వేల వరుసల్లో కవిత రాశారు. కేరళ రాష్ట్రానికి చెందిన యూనివర్సల్‌ అచీవర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, ఫ్యూచర్‌ కలాం బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ సంస్థలు అతనికి బహుమతి, ప్రశంసా పత్రాలను అందించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని