logo

శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..

శరీర బరువు తగ్గించుకునేందుకు వెళ్లిన యువకుడు చికిత్స మధ్యలోనే మృతిచెందిన ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు ..

Updated : 25 Apr 2024 10:32 IST

హేమచంద్రన్‌ (పాతచిత్రం)

ప్యారిస్‌, న్యూస్‌టుడే: శరీర బరువు తగ్గించుకునేందుకు వెళ్లిన యువకుడు చికిత్స మధ్యలోనే మృతిచెందిన ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు .. పుదుచ్చేరికి చెందిన సెల్వనాథన్‌కి హేమచంద్రన్‌, హేమరాజన్‌ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. 26 ఏళ్ల వయసున్న వారిద్దరు కవల పిల్లలు. హేమచంద్రన్‌కు శరీర బరువు సమస్య ఉంది. సుమారు 150 కిలోల బరువున్న అతను చెన్నై పమ్మల్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్సకు చేరాడు. శస్త్రచికిత్స ద్వారా కొవ్వులు తొలగించేందుకు వైద్యులు నిర్ణయించారు. ఇందుకు 22న అతను ఆస్పత్రిలో చేరాడు. శస్త్రచికిత్స ప్రారంభమైన 15 నిమిషాల్లోనే గుండెపోటుతో మృతిచెందినట్లు డాక్టర్లు తెలిపారు. హేమచంద్రన్‌ మృతిపై అనుమానం ఉందని కుటుంబీకులు బుధవారం పుదుచ్చేరి శంకర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని